Dhananjaya: కన్నడ నటుడు ధనుంజయ గురించి మనందరికీ తెలిసిందే. చాలా మంది ధనుంజయ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ పుష్ప సినిమాలో జాలిరెడ్డి అంటే చాలు ఇట్టే గుర్తు పట్టిస్తారు. ఈ సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు ధనంజయ. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప మూవీలో జాలిరెడ్డిగా నటించారు. ఈ సినిమాతో ధనంజయ క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇకపోతే ధనుంజయ ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా తన ప్రియురాలు డాక్టర్ ధన్యతో కలిసి ఏడడుగులు వేశారు. ఇది తాజాగా ఈ నవ దంపతులు ఆత్మీయులకు అభిమానులకు క్షమాపణ తెలిపారు.
ఇంతకీ వారు అభిమానులకు ఆత్మీయులకు ఎందుకు క్షమాపణలు తెలిపారు అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మైసూరులో బంధుమిత్రులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఆదివారం అనగా ఫిబ్రవరి 16న వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు దాదాపు 30 వేల మందికి పైగానే హాజరయ్యారు. పెళ్లి తంతు పూర్తి అయిన తర్వాత మీడియా పూర్వకంగా అందరి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్‌మీడియా ద్వారా పలు విషయాలు పంచుకున్నారు. పెళ్లికి వచ్చిన వారందరికీ, రాలేకపోయిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెళ్లి వేడుకలు ఘనంగా జరగడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, అభిమానులు, మీడియా, పోలీసు శాఖ ఇలా ఎంతో మంది కృషి చేశారు. వారందరికీ మా ఇద్దరి తరఫున ధన్యవాదాలు. మా పెళ్లి కోసం చాలామంది హాజరయ్యారు. దీంతో కొంతమంది మాపై అభిమానంతో ఫంక్షన్ హాలు వరకు వచ్చి కూడా లోపలికి రాలేకపోయారు. మీకు ఇబ్బంది కలిగించినందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము తప్పకుండా మరిన్ని మంచి విషయాలతో తిరిగి మిమ్మల్ని కలుస్తాము. పెద్ద మనుసుతో మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ధనుంజయ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.