రెస్టారెంట్స్‌లో టిప్ కల్చర్ కామన్‌గా మారింది. తిన్నతర్వాత వారు చేసిన సర్వింగ్ విధానం నచ్చితే మనకు తోచినంత టిప్ ఇస్తాం. కొందరు పది మరికొందరు వంద ఇంకొందరు వారి స్తోమతని బట్టి వెయ్యి రూపాలు కూడా టిప్‌గా ఇస్తుంటారు. అయితే ఓ కస్టమర్ దేవుడు ఏకంగా రెండు లక్షల రూపాయలు టిప్‌గా ఇచ్చాడు. అంత మొత్తం టిప్‌గా ఇచ్చాడంటే ఎంతగా తిని తాగాడో అనే అనుమానం అందరికి వస్తుంది. కాని అతను తాగింది కొంచెమే. స్పృహలోనే ఉండి అంత మొత్తాన్ని టిప్‌గా ఇచ్చాడంట.
కరోనా వలన అన్నిరంగాల పరిస్థితి అద్వాన్నంగా మారింది. ప్రపంచ దేశాలన్నీ కరోనా కల్లోలంతో వణికిపోయాయి. కరోనా తర్వాత చాలా మందికి జీవనోపాధి కరువైంది. అలాంటి వారికి కొందరు తమకు చేతనంత సాయం చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈక్రమంలోనే ఓ కస్టమర్ వేల డాలర్లు (రూ.2.21 లక్షలు) టిప్ గా ఇవ్వడంతో అమెరికాలోని క్లేవేల్యాండ్‌లోని ఓ రెస్టారెంట్ యజమాని బ్రెంన్డాన్ రింగ్ షాకయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది
ఈ విషయం గురించి మాట్లాడిని బ్రెంన్డాన్.. 7.02 డాలర్లు (రూ.515) విలువ చేసే బీరు తాగారు. 3 వేల డాలర్లు (రూ.2.21 లక్షలు) టిప్ ఇచ్చారు. ఇది చూసి మేమంతా షాకయ్యాం. పొరపాటున ఇచ్చారేమోనని ఆయనకు ఈ విషయం తెలియజేయగా, ఆయన మీరు మళ్లీ బార్‌ను ‘రీఓపెన్’ చేశాక కలుద్దామని నవ్వుతూ చెప్పారు’’ అంటూ బ్రెంన్డాన్ పేర్కొన్నాడు. ఆయన పేరు నాకు చెప్పాలని ఉంది కాని అది ఆయనకు ఇష్టం లేదు. మా పరిస్థితిని అర్ధం చేసుకొని ఆయన చేసిన సాయానికి కృతజ్ఙతలు అని బార్ యజమాని పేర్కొన్నాడు.