ఈ జాగ్రత్త ముందు ఏమైంది మంత్రిగారు…జగన్ కు చెడ్డపేరు వస్తేగాని స్పదించారా..?

anti waves to ysrcp

 సీఎం జగన్ ప్రజలకు చేస్తున్న మంచి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు కూడా ప్రభుత్వం నుండి ఎదో ఒక రకంగా ఆర్థిక సహాయం పొందుతుంది. మతాలు , కులాలు, రాజకీయం లెక్కలు లాంటివి ఏమి లేకుండా అర్హత కలిగిన ప్రతిఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందేలా చేయటంలో సీఎం జగన్ సక్సెస్ అవుతున్నాడు, అయితే కొన్ని కొన్ని నిర్ణయాలు జగన్ కు చెడ్డ పేరు తీసుకోని వస్తున్నాయి.

avanthi srinivas

 తాజాగా నవంబర్ 2 న రాష్ట్రంలో స్కూల్స్ రీ ఓపెన్ చేశారు , కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నకాని స్కూల్స్ ఓపెన్ కావటంపై చాలా మంది విమర్శలు చేశారు , కానీ వాటిని సర్కార్ పట్టించుకోకుండా స్కూల్స్ ఓపెన్ చేశారు , తీరా ఓపెన్ చేసిన రెండు రోజులకే దాదాపు 150 మందికిపై కరోనా సోకటం తీవ్ర కలకలం దృష్టించింది. దీనితో జగన్ తీసుకున్న చర్య ఒక తొందరపాటు చర్య అని, జగన్ సర్కార్ కు ప్రజారోగ్యం ముఖ్యంగా పసిపిల్లలు అంటే లెక్క లేదని, స్థానిక ఎన్నికల విషయంలో కరోనా ను చూపి ఆపేస్తున్న జగన్ కు స్కూల్స్ విషయంలో కరోనా కనిపించలేదా అంటూ అన్ని వర్గాల నుండి విమర్శలు రావటం జరిగాయి.

 దీనితో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దింగింది. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ ఇళ్ల స్థలాల విషయం గురించి మాట్లాడుతూ అదే సమయంలో స్కూల్స్ విషయంలో కూడా స్పందించాడు. కరోనా సమయంలో బలవంతంగా స్కూల్ కి ఎవరిని రప్పించడం లేదు అన్నారు. తల్లి తండ్రులు ఇష్ట ప్రకారం విద్యార్థులు స్కూల్ కి హాజరు కావచ్చు అన్నారు. ఈ సమయంలో విద్యార్థుల హాజరు తప్పని సరి కాదు అన్నారు. తల్లిదండ్రులు ఇష్టపడితేనే పంపండి లేకపోతే లేదు అన్నట్లు మంత్రి మాట్లాడటం జరిగింది.

కానీ పల్లెటూరిలో ఒక పిల్లడు స్కూల్ కు వెళ్తున్నాడంటే తమ పిల్లలు వెళ్లకపోతే చదువులో ఎక్కడ వెనకబడి పోతారేమో అనే భయం అక్కడి తల్లిదండ్రులకు ఉంటుంది, అదే సమయంలో కరోనా మీద తగినంత అవగాహనా కూడా ఉండదు. పైగా ప్రభుత్వం బడులు పెట్టింది కాబట్టి భయమేమీ లేదనుకొని పిల్లలను పంపటం జరుగుతుంది. ఆంటే ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతోనే వాళ్ళు పంపిస్తారు, కానీ మంత్రి గారు మాత్రం మాకు సంబంధం లేదు మీ ఇష్టం పంపితే పంపండి లేకపోతె లేదన్నట్లు మాట్లాడటం విచిత్రం. అయినా విద్యాశాఖ మంత్రి ఆదిమలుపు సురేష్ గారు ఎక్కడ దీని గురించి స్పందించకపోవటం విడ్డురం