Crime News: ప్రస్తుత కాలంలో చాలా మంది ఏ చిన్న సమస్య ఎదురైనా కూడా దానిని పరిష్కరించే మార్గం కోసం చూడకుండా ఆత్మహత్య మాత్రమే సమస్యకి పరిష్కారమని భావిస్తున్నారు. చిన్న సమస్యను ఎదుర్కోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటన ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. చదువు మనిపిచ్చారని బాధతో మనస్థాపం చెందిన చిన్నారి క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి కి చెందిన బాలిక స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. బాలిక చదువు పట్ల ఎంతో ఆసక్తి చూపుతు క్రమం తప్పకుండా స్కూల్ కి వెళ్ళేది. అన్ని విషయాలలోనూ చాలా చురుకుగా ఉండేది.కానీ.. కొంత కాలం క్రితం చిన్నారి తల్లి అనారోగ్యం పాలవడంతో ఆమెకు సపర్యలు చేయటానికి ఇంటివద్ద ఉంటూ తల్లిని జాగ్రత్తగా చూసుకోమని తండ్రి చిన్నారికి చెప్పాడు.
చదువు అంటే ఎంతో ఇష్టం ఉన్న చిన్నారి తాను పాఠశాలకు వెళ్తానని తల్లితండ్రులను కోరగా.. కొంత కాలం ఇంటివద్దే ఉండాలని చెప్పారు. ఈ క్రమంలో బాలిక తనని చదువు మానిపించారాని, ఇక ఎప్పటికి తను చడుకొలేదేమో అని తీవ్రంగా బాధ పడింది. ఈ క్రమంలోనే బుధవారం కూడా తన తల్లిదండ్రులను పాఠశాలకు వెళ్తానని కోరగా వారు నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి చికిత్సకోసం ఆస్పత్రికి తరలించగా వైద్యం పొందుతూ ప్రాణాలు విడిచింది. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.