గాసిప్స్ : ప్రభాస్ సినిమాలో క్యామియోకి ఈ బిగ్గెస్ట్ స్టార్ హీరో? నిజమేనా??

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఆల్ మోస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రాలు అన్నీ మన తెలుగు సహా సౌత్ ఇండియన్ సినిమా నుంచే వస్తున్నాయని చెప్పాలి. మరి ఈ చిత్రాల్లో మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రతి సినిమా కూడా ఒకొక్కటి ఒకో రేంజ్ లో ఉంటుండగా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో “సలార్” అనే క్రేజీ ఏక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలతో నీల్ తన సినిమాల సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నాడని టాక్ ఉంది. అందులో భాగంగా తన హీరోలు ఒక సినిమా నుంచి మరో సినిమాలో కనిపించే అవకాశం ఉంది అంటూ ఓ ఆసక్తికర టాక్ వైరల్ గా మారింది.

అలా ఇప్పుడు ఒక సెన్సేషనల్ గాసిప్ సినీ వర్గాల్లో ఆసక్తిగా వినిపిస్తుంది. మరి ఈ సలార్ సినిమాలో కూడా ఓ బిగ్ స్టార్ హీరో క్యామియో ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కూడా కాదట ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సెన్సేషన్ యష్ అట.

సలార్ సినిమాలో బహుశా రాకీ భాయ్ గా యష్ కనిపించే అవకాశం ఉందని ఓ ఊహించని గాసిప్ ఇప్పుడు భారీ అంచనాలు నెలకొల్పుతుంది. ఇంకా దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది కాని నిజం అయితే మాత్రం ఇండియన్ సినిమా దగ్గర వసూళ్ల వర్షం కురవడం గ్యారెంటీ అని చెప్పాల్సిందే.