వసూల్ రాజాగా మారిన వైసీపీ ఎమ్మెల్యే

ఏపీలో మరో ముప్పై ఏళ్లు సీఎంగా ఉండాలని తహతహలాడుతున్న జగన్ అవినీతిని అరికట్టేందుకు రివర్స్‌ టెండరింగ్‌, జుడీషియరీ రిప్యూ వంటి కొత్త పద్దతులను తీసుకొచ్చారు. పొలిటికల్‌ కరెప్షన్‌ తగ్గించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పెట్టుబడులను ఆకర్శించి ఎకానమీని పెంచాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఇంకో రూట్లో వెళ్తూ తమ ఎకానమీని  పెంచుకుంటున్నారు. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న అంశాల్లో జోక్యం చేసుకుంటే తేలిగ్గా దొరికిపోతామని భావిస్తున్న కొందరు నేతలు, ఉన్నతాధికారులు.. కొత్త పద్దతుల్లో అవినీతికి తెరలేపుతున్నారు.

APIICలోని ఓ ఉన్నతాధికారి, చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే కలిసి సరికొత్త దందాకు తెరతీశారట. తన నియోజకవర్గ పరిధిలో APIIC ఆయా సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు సేకరించి…. సదరు సంస్థల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంట ఓ వైసీపీ ఎమెల్యే. APIICలో కీలక స్థానంలో ఉన్న ఓ ఉన్నతాధికారి ఈ ఎమ్మెల్యేకు సహకరిస్తున్నారట. మీది తెనాలే, మాది తెనాలే, మనది తెనాలే అన్నట్లు….ఇద్దరిది ఒకే జిల్లా కావడంతో వీరి మధ్య స్నేహం బాగా బలపడిందట. ఇక ఇంకేముంది జాయింట్ గా దోచుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంట.


ఇక్కడ ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేయడం… కాదంటే రోజుల వ్యవధిలోనే APIIC నుంచి నోటీసులు రావడం పరిపాటి అయిపోయిందట. అధికారుల అండతో టెక్నికల్‌ లోపాలను గుర్తించి వాటిని అడ్డం పెట్టుకొని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారంట ఈమిత్ర ద్వయం. దైర్యం చేసి ఓ వ్యాపారవేత్త సీఎం జగన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారంట. APIIC చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే రోజ…. ముందు ఇలాంటి వ్యవహారాలపై దృష్టి పెట్టాలని సదరు వ్యాపార వేత్త సీఎం జగన్ కి సూచించారట.