Corona Virus: కరుణ ప్రపంచ దేశాలన్నింటిలో చాపకింద నీరులా వ్యాపించి తీరని నష్టం కలగజేసింది. రెండేళ్ల క్రితం చైనాలో ఉద్భవించిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఒక్కో దశలో ఒక్కో విధంగా రూపాంతరం చెంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా వేరియంట్ అయిన ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పట్టాయని ఊపిరిపీల్చుకున్న సమయంలో కొత్తగా కరోనా XE కేసులు వెలుగుచూశాయి. దీంతో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
దేశంలో లో కరుణ కేసులు తగ్గుముఖం పట్టడంతో కొన్ని రాష్ట్రాల్లో కరోనా అంశాలను సడలించాయి. దీంతో ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశంలో కరోనా XE కేసులో వెలుగు చూడటంతో దీనిని తేలికగా తీసుకోకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనుసుఖ్ మాండవియా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాడు. ప్రజలందరూ కరోనా నిబంధనలను ఉల్లంఘించి కాకుండా జాగ్రత్త వహించాలని, కరోనా వ్యాప్తి పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో 12 సంవత్సరాల లోపు పిల్లలకు టీకాలు వేసే ప్రక్రియ గురించి నిపుణుల పర్యవేక్షణలో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసి 60 సంవత్సరాల పైన ఉన్న వృద్ధులకు ప్రభుత్వ వైద్య కేంద్రాలలో ఉచితంగా వ్యాక్సిన్స్ అందిస్తామని తెలియజేశారు. కరోనా కొత్త వేరియంట్ XE వేరియంట్బుజ్జి లో ఉంచుకొని ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా సామాజిక దూరం పాటిస్తూ ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.