ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో పంజా విసురుతోంది. ఇక ప్రజా ప్రతినిధులను కూడా కరోనా వదలడంలేదు. కొద్ది రోజులుగా అధికార వైసీపీ పార్టీ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా సోకింది. తాజాగా ఆయనకు కరోనా టెస్ట్ నిర్వహించగా, పాజిటివ్ అని తేలింది. ఇక అయనతో పాటు ఆయన పీఏకి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విజయసాయిరెడ్డి 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ క్రమంలో అత్యవసరం అయితే తప్ప టెలిఫోన్‌లో కూడా అందుబాటులో ఉండబోనని విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.