ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో పలువురు వైరస్ బారిన పడ్డారు. అలాగే మంత్రులకు వైరస్ సోకింది. కొంత మంది కోలుకోగా, ఇంకొంత మంది చికిత్స తీసుకుంటున్నారు. చాలా మంది హోమ్ క్వారంటైన్ లో ఉంటూ..డాక్టర్లు చెప్పిన సూచనలు, సలహాలు తీసుకుంటూ వైరస్ బారి నుండి బయటపడుతున్నారు. వాళ్ల చుట్టూ ఉండే భద్రతా సిబ్బంది, డ్రైవర్లకు కూడా కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా వాళ్లతో సన్నిహితంగా ఉన్న వారంతా పరీక్షలు చేయించుకుని అవసరం మేర క్వారంటైన్ లో ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా మరో వైకాపా ఎమ్మెల్యేకు కరోనా బారిన పడ్డారు. శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఆయనకు వైరస్ ఎలా సోకింది అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు చేసినట్లు సమాచారం. ఆ వివరాలు బయటకు రావాల్సి ఉంది. అలాగే ఆయనతో పాటు సన్నిహితంగా మెలిగిన వారందరు పరీక్షలు చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే తెలిపారు. వైరస్ విషయంలో ఎంత మాత్రం భయపడాల్సిన పనిలేదని…అలాగే అశ్రద్ద చేయవద్దని హెచ్చరించారు.
ఏపీలోనూ తెలంగాణ రాష్ర్టం తరహాలో రోజు కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ర్టాల్లో పోటా పోటీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలకు పైగానే ఉంది. 534 మంది మృత్యువాత పడ్డారు. ఇక వైరస్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని…వైరస్ కి ఎవరూ అతీతులు కారని హెచ్చరించారు. ఎవరికైనా సోకే అవకాశం ఉందని..వైరస్ తో కలిసి బ్రతకాల్సిందేనని…కరోనా సోకని వారంటూ ఎవరూ ఉండరని జగన్ అన్న సంగతి తెలిసిందే.