తెలంగాణ, కరోనా, తెలంగాణ రెవెన్యూ, కేసీఆర్, తెలంగాణ నామినేటెడ్ పోస్టులు, తెలుగు రాజ్యం తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు ఇంత కాలం పెట్టుకున్న ఆశలను టీఆర్ఎస్ నాయకులు వదిలేసుకుంటున్నారు. కేసీఆర్ సర్కారు మరోసారి అధికారంలోకి రాగానే పార్టీ నేతల్లో చాలా మంది నామినేటెట్ పోస్టులపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అయితే రెండేళ్లు గడిచినపోయిన ఈ పోస్టుల భర్తీ మాత్రం ముందుకుసాగడం లేదు.
ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని వాళ్లు… కేసీఆర్ పై నమ్మకంతో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్లంతా ఈ కార్పోరేషన్ పదవులపై మొదట్లో కన్నేశారు. అవకాశం చిక్కితే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ పోస్టులను అయినా పొందాలని విశ్వప్రయత్నం చేశారు. అయితే ఒక నామినేటెడ్ పోస్టును భర్తీ చేయడం అంటే సదరు ఛైర్మన్ కు కారు, ఆఫీసు, కార్యాలయ సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. వీరందరికి జీతభత్యాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. కరోనా కష్టాల్లో ఇంత ఆర్థిక భారాన్ని కేసీఆర్ వేయరని తెలుకున్న నేతలంతా ఇప్పుడు
బాధపడిపోతున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మంత్రి కాకముందు మిషన్ భగీరత కార్పోరేషన్ కు ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన మంత్రి అయిన తర్వాత ఆ పోస్టు అలాగే ఖాళీగా ఉంది. ప్రత్యేక అధికారులకు ఈ బాధ్యతలను అప్పగించారు. అదే విధంగా ఆయా కార్పోరేషన్ల బాధ్యతలను అధికారులకు అప్పగించి ఖర్చులు తగ్గిస్తున్నారు సీఎం కేసీఆర్. అదండీ సంగతి.