Corona: చైనాలో ఉద్భవించిన ఈ కరోనా ప్రపంచ దేశాలను గడగడ వణికించింది. ఈ కరోనా ఒక్కోసారి ఒక్కో విధంగా రూపాంతరం చెంది వివిధ రకాల వేరియంట్ లతో ప్రజల మీద దాడి చేస్తోంది. కరోనా విజృంభించిన ఫస్ట్ వేవ్ లో దగ్గు జలుబు జ్వరం వంటి లక్షణాలు తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల ప్రాణహాని జరిగింది. కొంతకాలం తర్వాత ఈ కరుణ రూపాంతరం చెంది డెల్టా వేరియంట్ గా ప్రపంచ దేశాలలో అత్యధిక స్థాయిలో ప్రాణనష్టం వాటిల్లింది. ఈ డెల్టా వేరియంట్ కారణంగా ఆక్సిజన్ కొరత ఏర్పడి అధిక సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు.
కరోనా థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ థర్డ్ వేవ్ లో కరోనా ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ లక్షణాల తీవ్రత ఎక్కువగా లేకపోవడం వల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు. అయినప్పటికీ ప్రభుత్వాలు కరోనా నిర్మూలనకు ఇప్పటికే ప్రజలకు వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చారు. భారతదేశంలో ప్రజలకు ఇప్పటికే కరోనా 2 వ్యాక్సిన్ లు వేసి బూస్టర్ డోస్ లు కూడా ప్రారంభించారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం చైనాలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా కేసులు భారీ స్థాయిలో రావటం వల్ల చైనాలో లాక్ డౌన్ విధించారు. ఆదివారం ఒక్కరోజే గరిష్టంగా 3100 కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలో 1.70 కోట్ల జనాభా ఉన్న స్కెంజెన్‌లో, సోమవారం నుండి అన్ని నగరాలు మరియు గ్రామాలలో లాక్‌డౌన్ విధించబడింది. కరుణ వ్యాధి నిర్మూలన కి చైనా ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. షాంఘైలో పాఠశాలలు, వ్యాపారాలు మరియు మాల్స్-రెస్టారెంట్లు కూడా మూసివేయబడ్డాయి.