ఏపీలో కరోనా వైరస్ మోత మోగిస్తుంది. రోజురోజుకి కరోనా కేసులు లెక్క ఎక్కువ అవుతుందే గానీ, తక్కువ కానుంటుంది. అలాగే ఈమధ్యం ఏపీలో కరోనా మరణాలు కూడా ఎక్కువయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 49,553 శ్యాంపిళ్ళను పరీక్షించగా, ఏకంగా 6045 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా కారణంగా ఒక్కరోజులోనే 65 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,713 కుచేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారు ఇప్పటి వరకు 823 మంది మృతి చెందగా, 32,127 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం ఏపీలో 31,763 మంది కరోనా పేషెంట్లు వివిద ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇక జిల్లాల వారిగా చూసుకుంటే ఈసారి విశాఖలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజులోనే ఏకంగా 1049 రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో 891, గుంటూరు జిల్లాలో 842 కరోనా కేసులు నమోదయ్యాయి.