ఆజిల్లాలో సొంత పార్టీ ఎంపీలనే తొక్కేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు

అంతా అధికార వైసీపీ ప్రజాప్రతినిధులే…అయినా వాళ్లలో వాళ్లకే పొసగడం లేదు. గుంటూరు జిల్లాలోని వైసీపీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అస్సలు పడడం లేదు. ఏడాదిన్నరగా సాగుతున్న ఈ కలహాల కాపురం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎంపీలంటే ఎమ్మెల్యేలకు పడదు. ఎమ్మెల్యేల పెత్తనం ఎంపీలు ఒప్పుకోరు. జగన్ సర్కారు కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినప్పటి నుంచి… ఈ పరిస్థితి నెలకొంది.

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుతో ఆయన నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలంతా దూరంగా ఉంటున్నారు. ఏదో ప్రొటోకాల్‌ కోసం అప్పుడప్పుడు పిలవడం తప్పితే…ఆయనతో కలిసి పని చేయడం లేదు.పల్నాడు ప్రాంతాన్ని నరసరావుపేట జిల్లాలో కలపాలని గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తుంటే… గురజాలను జిల్లా కేంద్రం చేయాలనే ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. ఇలా ప్రారంభమైన కోల్డ్ వార్ నానాటికి పెరిగిపోతోంది. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని,  మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిల అయితే ఎంపీ కృష్ణదేవరాయులు పూర్తిగా దూరం పెట్టేశారు. ఎమ్మెల్యే రజనీ, ఎంపీ కృష్ణ దేవరాయుల వర్గాలు పరస్పర దాడులు కూడా చేసుకున్నాయి.


బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ది కూడా ఇదే పరిస్థితి. బాపట్ల లోకసభ నియోజకవర్గంలో ఆయన పలుకుబడి చాలా తక్కువ. దీంతో ఆయన్ని తొక్కేస్తున్నారంట స్థానిక ఎమ్మెల్యేలు. ఎంపీకి బలపడే అవకాశం ఇస్తే మళ్లీ రేపు తమపై పెత్తనం చేస్తారనే భయంతో ఇప్పటి నుంచే ఆయన్ని తొక్కడం స్టాట్ చేశారంటా ఆ పార్టీకే చెందిన స్థానిక ఎమ్మెల్యేలు. ఇలా గుంటూరు జిల్లాకే చెందిన ఇద్దరు ఎంపీలను ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు అణగదొక్కుతున్నారు. దీంతో క్యాడర్ లో గందరగోళం నెలకొంది. ఈ ఇద్దరు ఎంపీల దగ్గరికి వెళ్తిన వాళ్లని కూడా  ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నారంట.