కిడ్నీకి మూడు కోట్లు ఇస్తామని ఆశ చూపి యువతి దగ్గర నుండి 16 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల సైబర్ నేరాలు కూడా అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇటీవల కొంతమంది కేటుగాళ్లు కిడ్నీ ఇస్తే మూడు కోట్లు ఇస్తామని ఒక యువతికి ఆశ చూపి ఆమెనుండి 16 లక్షలు కాజేసిన ఘటన చర్చనీయంగా మారింది. మూడు కోట్ల కోసం ఆశపడి 16 లక్షలు పోగొట్టుకున్న యువతి తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే… గుంటూరు జిల్లాకు చెందిన యువతి హైదరాబాదులో నర్సింగ్ కోర్స్ చేస్తోంది. ఈ క్రమంలో తన అవసరాల నిమిత్తం తండ్రికి తెలియకుండా తన తండ్రి అకౌంట్ నుండి రెండు లక్షల రూపాయలు వాడుకుంది. అయితే ఎలాగైనా ఆ రెండు లక్షల రూపాయలు తన తండ్రికి తెలియకుండా మళ్లీ అకౌంట్లో వేయాలని భావించింది. అందుకోసం తన కిడ్నీ అమ్మటానికి ప్రయత్నం చేసి ఆన్లైన్ లో ఉన్న వెబ్సైట్ ద్వారా ఒక ఫోన్ నెంబర్ కి కాల్ చేసింది. యువతి అవసరం తెలుసుకున్న కేటుగాళ్లు కిడ్నీ ఇస్తే 7 కోట్లు ఇస్తామని ఆమెకు ఆశ చూపారు. ముందుగా ఆమెను నమ్మించడానికి పదివేల రూపాయలు ఆమె అకౌంట్లో జమ చేశారు. దీంతో ఆ యువతి వారిని గుడ్డిగా నమ్మింది.

ఆ తర్వాత ఆమె పేరిట ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో మూడు కోట్లు జమ చేశారు. ఆ మొత్తం డబ్బు తీసుకోవటానికి కొన్ని టాక్స్ లు చెల్లించాలని… ఇందుకోసం రూ. 16 లక్షలు చెల్లించాలని చెప్పి బాధిత యువతి నుండి రూ.16 లక్షల రూపాయలు కాజేశారు. ఈ మొత్తం డబ్బును విడతల వారీగా ఫోన్ పే ద్వారా యువతి వారికి చెల్లించినట్లు తెలిపింది. చెన్నై సిటీ బ్యాంక్ పేరిట వారి ఖాతాలో ఉన్నట్లు. ఆ తర్వాత కూడా రూ. 1.50 చెల్లించాలని వారు పోరాటంతో యువతికి అనుమానం వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసినట్లు యువతి వెల్లడించింది. ఇలా కంటికి తెలియకుండా రెండు లక్షల రూపాయలు వాడుకొని తిరిగి ఆ డబ్బును సంపాదించడం కోసం కిడ్నీ అమ్మటానికి ప్రయత్నించి రూ.16 లక్షలు పోగొట్టుకుంది.