R.K Roja: మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్.. రోజాపై కేసు నమోదు.. అదే కారణమా?

R.K Roja: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నాయకులు కార్యకర్తలపై పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఇలా కేవలం వైకాపా వారిని మాత్రమే అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో కూటమీ ప్రభుత్వ తీరు పట్ల వ్యతిరేకత వస్తుంది. అయితే తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజాపై కూడా కర్నూలులో కేసు నమోదు అయ్యింది.దళిత సంఘాల ఫిర్యాదు మేరకు.. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రోజా గత ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు అయితే ఈమె మంత్రిగా ఉన్న సమయంలో గుంటూరు జిల్లాలోని బాపట్లలో సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. అప్పుడు.. ఒక దళిత ఉద్యోగితో రోజా చెప్పులు మోయించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై దళిత సంఘాలు సైతం భగ్గుమన్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం గురించి అప్పట్లో రోజా పెద్ద ఎత్తున వివాదంలో కూడా నిలిచారు.

తాజాగా ఇలా ఒక దళిత ప్రభుత్వ ఉద్యోగి చేత రోజా తన చెప్పులు మోయించడం పట్ల దళిత సంఘాల నేతలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈమెపై కర్నూలులో పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. పర్యాటక శాఖ రిసార్ట్స్‌ వద్ద మంత్రికి అధికారులు స్వాగతం పలికి బీచ్‌ దగ్గరకు తీసుకెళ్లారు. ఆమె సముద్రపు నీటిలోకి దిగే ముందు ఒడ్డున చెప్పులు విడిచారు. ఆ తర్వాత ఒక ఉద్యోగికి దాని బాధ్యతలు అప్పగించారు.

ఇక ఆ ఉద్యోగి చేత రోజా తన చొప్పులను కూడా మోయించారు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మరి ఈ విషయంపై రోజా ఏవిధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.