ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త … ఏంటంటే ?

cm kcr tension on warangal and khammam districts

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఉద్యోగుల ప్రమోషన్ల కోసం కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేసీఆర్ సంబంధిత ఫైలుపై ఆయన సంతకం చేశారు. ఇటీవల రాష్ట్రంలోని ఉద్యోగుందరికీ వేతనాలు పెంచుతామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నియామకాలను సైతం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

cm kcr file photo
cm kcr 

ఈ నేపథ్యంలో ఆయా శాఖల్లో ఖాళీలను గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. దీంతో ప్రమోషన్ల ప్రక్రియను సైతం ప్రభుత్వం ప్రారంభించింది. పదోన్నతుల అనంతరం ఖాళీల సంఖ్య పూర్తి స్థాయిలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలోగా పదోన్నతులను పూర్తి చేసి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

ప్రభుత్వ విభాగంలోని అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాలను చేపడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులూ కలిసి 9, 36,976 మంది ఉంటారు. వీరందరికి వేతనాల పెంపు వర్తిస్తోందని ప్రభుత్వం తెలిపింది.