పోలవరం పై జగన్ వ్యాఖ్యలు తో సొంత పార్టీ నేతలే షాక్.. అయోమయంలో ప్రతిపక్షాలు

cm jagan

 పోలవరం విషయం ఏపీ రాజకీయాల్లో అలజడి సృష్టిస్తున్న విషయం అందరికి తెలిసిందే, పోలవరం విషయంలో కేంద్రం పేచీ పెట్టటంతో ఇప్పట్లో పూర్తి అవుతుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . తాజాగా సీఎం జగన్ 2022 నాటికీ పోలవరం పూర్తి చేస్తామని చెప్పటం నిజంగా ఒక షాకింగ్ అనే చెప్పాలి. ఏళ్ల తరబడి సాగుతున్న పోలవరం ప్రాజెక్టుని మరో రెండేళ్లలో పూర్తిచేయడం సాధ్యమేనా అనేదే ఇక్కడ ప్రశ్న.

cm jagan

 వైసీపీ అధికారంలోకి వచ్చాక కనీసం ఒక శాతం కూడా పని జరగలేదని టీడీపీ విమర్శలు చేస్తున్న వేళ.. ఏకంగా రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని జగన్ స్టేట్ మెంట్ ఇవ్వడం వెనక ఆంతర్యమేంటి? ఆయనది ఓవర్ కాన్ఫిడన్సా, లేక ఓన్లీ కాన్ఫిడెన్సా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. పోలవరం అంచనా విలువ 55,548కోట్ల రూపాయలుగా గతంలో కేంద్ర జలశక్తి సంస్థ పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ నిర్థారించింది. దీనిపై సమీక్ష జరిపి రూ47,725కోట్లుగా తేల్చారు. అయితే 2013-14 అంచనా ప్రకారం పోలవరం వ్యయాన్ని కేవలం 20,398 కోట్ల రూపాయలుగా తీర్మానిస్తూ.. అదే మొత్తాన్నీ తాము ప్రాజెక్ట్ కి కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. ఇక్కడే కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వివాదం మొదలైంది.

ప్రస్తుతం రాష్ట్రం వద్ద తగినన్ని నిధుల్లేవు. కేంద్రం ఇచ్చేలా లేదు. నిర్వాసితుల విషయంలో కేంద్రం పెడుతున్న పేచీలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి టైమ్ లో జగన్ పోలవరంపై హామీ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఉన్న కొద్ది పాటి నిధులను సంక్షేమ పధకాలకు కేటాయిస్తున్నారు. మరి ఇలాంటి స్థితిలో పోలవరం పూర్తీ చేయటం అనేది సాధారణమైన విషయం కాదు. కానీ ఇక్కడ మాట ఇస్తుంది సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాట ఇస్తే వెనక్కి తీసుకునే అలవాటు లేదు.

 ప్రతి పక్షములో ఉన్నప్పుడు ఇచ్చిన మాటకు విలువిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చిన జగన్, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంది ఇచ్చిన మాటను తప్పే ప్రసక్తి లేదనే చెప్పాలి. ఇదే మాట చంద్రబాబు నాయుడు నోటినుండి వస్తే పెద్దగా నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ, జగన్ చెప్పాడు కాబట్టి చేస్తాడనే అనుకోవాలి. మరి ఇన్ని వేల కోట్లు ఎక్కడ నుండి తీసుకోని వస్తాడో, దానికి సీఎం జగన్ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏమిటో మున్ముందు చూడాలి