ఆ ఒక్క విషయంలో సీఎం జగన్ సక్సెస్ కాలేకపోతున్నారా ? ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదా !

AP government shocks Ashok Gajapathi Raju

ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఓ వైపు మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా.., మందుబాబులు మాత్రం తెగతాగేస్తున్నారు. మద్యపానాన్ని నిషేదిస్తామని సీఎం జగన్ చెబుతున్నప్పటికీ, ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నివ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతున్న వనరుల్లో మద్యం అమ్మకాలు టాప్ లిస్ట్ లో ఉన్నాయి. ముఖ్యంగా గత నాలుగు నెలల్లో మద్యం అమ్మకాల ద్వారా సర్కార్ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చిపడుతోంది.

ap cm jagan

2020 సెప్టెంబర్ నెల నుంచి మధ్యం అమ్మకాల విలువ 45శాతం పెరిగింది. ఇది అక్టోబర్ లో 79శాతానికి పైగా ఉంది. 2019తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇక రాష్ట్ర ప్రబుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చిన సమయంలో మద్యం అమ్మకాలు 40శాతం తగ్గాయి. మద్యం షాపుల సంఖ్య తగ్గించి రేట్లు పెంచడంతో అమ్మకాలు పడిపోయాయి.అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు జారీ అయ్యయేవరకు బార్లు మూసేవేయడంతో లాక్ డౌన్ కాలంలో అమ్మకాలు మరింత తగ్గాయి.

మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అక్టోబర్ నెల మినహా 2019 అమ్మకాలతో పోలిస్తే 2020 అమ్మకాల విలువలో తగ్గుదల కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మద్యం దుకాణాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తున్నందున ఆ ప్రభావం అమ్మకాలపై పడింది. అయినా చివరకు ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాల సరళిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా.., ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న మద్యపాన నిషేధంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. షాపులు తగ్గించి, రేట్లు పెంచినా మద్యపాన నిషేధం దిశగా ఆశించిన ఫలితాలు కనిపించలేదని ఎక్సైజ్ విభాగం అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంటే మద్యపాన నిషేధం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఫార్ములా పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు.