ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల ఆరో తేదీ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నాడు, దానికి సంబదించిన అధికార ప్రకటన వచ్చేసింది. అతి తక్కువ కాలంలోనే ఇది రెండో సారి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి రావటం,జగన్ లాంటి నేత ఊరికే చంద్రబాబు లాగా షో కోసం ఢిల్లీలు, విదేశాలు పట్టుకు తిరిగాడు, అత్యంత అవసరమైతేనే జగన్ మోహన్ రెడ్డి వెళ్ళటం జరుగుతుంది. అలాంటిది నెల వ్యవధిలోనే రెండో సారి ఢిల్లీ పర్యటన అంటే ఎదో గట్టి విషయమే వుంటుందనే మాటలు వినవస్తున్నాయి.
రాజధాని భూముల విషయం అలాగే పోలవరం నిధులు గురించి జగన్ మోడీతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. కేవలం అది మాత్రమే కాకుండా మరో కీలక విషయం ఉందని అత్యంత సన్నిహిత వర్గాల నుండి సమాచారం వస్తుంది. ఈ మధ్య కాలంలో NDA కూటమి అకాలీదళ్ వెళ్ళిపోయింది. మరికొన్ని పార్టీలు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది బీజేపీ ప్రభుత్వానికి కొంచం ఇబ్బంది కలిగించే విషయం. దానిని సరిచేయడానికి 22 మంది ఎంపీల బలం కలిగి వున్నా వైస్సార్సీపీ పార్టీని అధికారికంగా NDA కూటమిలో చేర్చుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే గతంలో జగన్ అమిత్ షాతో భేటీ అయ్యినట్లు తెలుస్తుంది.
ఆ భేటీలో చాలా విషయాలు మాట్లాడుకొని జగన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాడని, దానికి కొనసాగింపుగా ఆఖరి భేటీ ప్రధానితో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ భేటీలో సీఎం జగన్ తమ డిమాండ్స్ ను మోడీ ముందుపెట్టి ఆయన నుండి హామిపొందిన తర్వాత NDA కూటమిలో చేరే అవకాశం లేకపోలేదు. చేరిన వెంటనే వైసీపీ పార్టీకి కేంద్ర క్యాబినెట్ పదవులు రాబోతున్నాయి. విజయసాయి రెడ్డి కి కేంద్ర క్యాబినెట్ పదవి, బీసీ , ఎస్సీ నేతలకు సహాయ మంత్రిత్వ శాఖలను వైసీపీ తీసుకునే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే ఇక చంద్రబాబు నాయుడుకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఇప్పటికే వైసీపీని తట్టుకోలేకపోతున్నా బాబు, కేంద్ర క్యాబినెట్ లో వైసీపీ చేరటం, బీజేపీ వైసీపీ ఒకే గొడుగు కిందకి వస్తే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అవుతుంది చంద్రబాబు పరిస్థితి.