అమరావతి చంద్రబాబు కలలు రాజధాని, అనేక గ్రాఫిక్స్ బొమ్మలు చూపించి రాజధాని ఇలాగే ఉండబోతుందని అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఆయన గ్రాఫిక్స్ లో అమరావతి మెట్రో రైలు కూడా ఒకటి, బెజవాడ నుండి అమరావతికి కలిసి మెట్రో ప్రతిపాదన చేసి, 2015 అక్టోబర్ 29న అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మొదట్లో విజయవాడకే పరిమితం అనుకున్నా, ఉత్తరాంధ్ర వాసుల డిమాండ్ తో విశాఖను కూడా అందులో చేర్చారు. అప్పటి అమరావతి మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రతిపాదనలు కేంద్రానికి నచ్చకపోవడంతో దాన్ని పక్కనపెట్టేశారు.
జగన్ ముఖ్యమంత్రి అయినా తర్వాత రాజధానిని అమరావతి నుండి విశాఖకు మార్చాడు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు కూడా విశాఖ కు మార్చే పని మెల్లగా మొదలవుతుంది, అదే సమయంలో అమరావతి లో నిర్మించాలని అనుకున్న మెట్రో రైలును అక్కడ కంటే ముందుగానే విశాఖలో నిర్మించాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఐదేళ్లు చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు ఒక ఇంచు ముందుకు కదలని మెట్రో రైలు విషయం, జగన్ ముఖ్యమంత్రి అయినా రెండేళ్ల లోపే టెండర్ల వరకు తీసుకొచ్చారంటే సీఎం జగన్ దీనిపై ఎంతగా దృష్టి సాధించాడో అర్ధం చేసుకోవచ్చు..
నాలుగు కారిడార్లుగా 75.31 కిలోమీటర్ల పరిధిలో విశాఖ మెట్రో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు కు కేంద్రం సహకారం ఇచ్చిన, ఇవ్వకపోయినా సరే దానిని పూర్తిచేయాలని వైసీపీ ప్రభుత్వం ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే విజయవాడలోని కనకదుర్గ ఫ్లై ఓవర్ క్రెడిట్ మొత్తం జగన్ ఖాతాలోకి వచ్చింది. మరోపక్క పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తిచేయాలని జగన్ చూస్తున్నాడు. ఇప్పుడు తాజాగా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలనీ అనుకోవటం నిజంగా బాబు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. పోలవరం, విశాఖ మెట్రో రైలు పూర్తి అయితే జగన్ ఇమేజ్ స్కై ని టచ్ చేయటం ఖాయం. దీనితో చంద్రబాబుకున్న దింపుడు కళ్ళం ఆశ కూడా చచ్చిపోయినట్లే అనుకోవాలి.