Ambanti Rambabu: ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఎన్టీఆర్ (Jr.NTR)పేరు తెరపైకి రావడంతో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఎన్టీఆర్ ను తొక్కేసే ప్రయత్నం మొదటి నుంచి కూడా జరుగుతుందనే వాదన తరచూ వినపడుతూనే ఉంది. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ ఆడియోలో దగ్గుబాటి ప్రసాద్ బూతులు మాట్లాడారు.
ఎన్టీఆర్ నటించిన సినిమాలను అడ్డుకుంటాము అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం పై దాడి చేశారు. అనంతరం బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్లు చేశారు. అయితే ఈ ఆడియో పై దగ్గుబాటి ప్రసాద్ స్పందిస్తూ తాను అలా మాట్లాడలేదని కుట్రలో భాగంగా కొందరు ఉద్దేశపూర్వకంగా చేశారు అంటూ క్షమాపణలు కూడా తెలిపారు.
ఇక ఈ వివాదంతో రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు స్పందించారు. తాజాగా అంబంటి రాంబాబు సైతం ఈ అంశం గురించి మాట్లాడుతూ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.”చిన్న ఎన్టీఆర్ ను చూసి పెదబాబు చిన్నబాబు భయపడుతున్నారా? అంటూ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ లను ట్యాగ్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ ట్వీట్ ద్వారా ఆయన తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలను ఎత్తిచూపడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వ్యవహారం ఇటు ఏపీ రాజకీయాలలో అటు సినీ పరిశ్రమలోను పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. అయితే ఇప్పటివరకు ఈ అంశం గురించి ఎన్టీఆర్ ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం.
