AP: జగన్ ను జైల్లో పెట్టడం కుదరదు… తప్పు చేస్తే కదా… చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు?

AP: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఇలా మంత్రులతో కలిసి సమావేశం నిర్వహించిన ఈయన జగన్ అరెస్ట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాబినెట్ మీటింగ్ లో భాగంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు కనుక తన పై ఎందుకు మనం చర్యలు తీసుకోకూడదు అంటూ ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు చెప్పిన సమాధానం సంచలనగా మారింది.

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గతంలో నన్ను జైలుకు పంపించారని ఇప్పుడు మనం తనని జైలుకు పంపించాలంటే కుదరదని తెలిపారు. తనని జైలుకు పంపించాలి అంటే ముందు తప్పు చేసినట్లు రుజువు కావాలని, తప్పు చేసినట్లు చట్టానికి దొరికితే మనం తనని జైలుకు పంపించే అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఇది వరకు నేరస్థులు ప్రభుత్వానికి బయపడి వెళ్ళిపోయేవారని.. ఇప్పుడు మనం నేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నేరం చేసి మళ్ళీ ప్రభుత్వంపైనే నిందలు వేసే పరిస్థితి నేడు నెలకొందని తెలిపారు. గంజాయ్ బ్యాచ్ నేరాలు చేసిందని.. తప్పులు చేసి.. తిరిగి ప్రభుత్వంపైనే నెడుతున్నారని మండిపడ్డారు. ఇక ఈ ఏడాది మంత్రుల పాలన అద్భుతంగా ఉందని ముందు ముందు ప్రజలకు మరింత మంచి పాలన అందించాలి అంటూ చంద్రబాబు నాయుడు మంత్రులకు కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది.

జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్టు చేయగలమంటూ ఈయన మాట్లాడిన మాటలపై వైసీపీ నేతలు తమలైన శైలిలో స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పులు అవినీతి చేయలేదని ఆయనని అరెస్టు చేయడం నీవల్ల కాదు అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొంతమంది జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి చూడు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే తప్పు చేస్తే ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని శిక్షకు అర్హులు అంటూ చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.