మాయదారి కరోనా వల్ల గత ఆరునెలల నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా లవర్స్ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా? సినిమా ఎప్పుడు చూడాలా? అని తహతహలాడుతున్నారు.
నిజానికి థియేటర్లు మూతపడ్డాక.. ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు గిరాకీ పెరిగింది. ఈమధ్య పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఎంతైనా థియేటర్ థియేటరే. సినిమా హాల్ లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా.
అందుకే.. సినిమా లవర్స్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్ లాక్ 5.0 లో భాగంగా… అక్టోబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే… థియేటర్ మొత్తం ఫుల్ చేయడానికి మాత్రం వీలులేదు. కేవలం 50 శాతం వరకు మాత్రమే సీట్లను నింపాల్సి ఉంటుంది. అది కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ థియేటర్లను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 30 తో అన్ లాక్ 4.0 గడువు ముగియడంతో… అన్ లాక్ 5.0 కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.