Chinmayi: రామాయణ రణబీర్ పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సింగర్ చిన్మయి!

Chinmayi: టాలీవుడ్ ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే చిన్మయి పేరు వినగానే చాలా మందికి సోషల్ మీడియా గుర్తుకు వస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో జరిగే చాలా అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో జరిగే పలు అంశాలతో పాటు సినిమాలకు సంబంధించిన విషయాల పట్ల కూడా స్పందిస్తూ తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ ఉంటుంది.

ఇలా తరచుగా ఏదో ఒక విషయం తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది చిన్మయి. అందులో భాగంగానే తాజాగా మరొకసారి వార్తల్లో నిలిచింది. తాజాగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ పై వచ్చిన ట్రోల్స్ కు రెస్పాండ్ అయ్యి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రణబీర్ ప్రస్తుతం రామాయణ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. రాముడిగా కనిపించనుండగా మేకర్స్ రీసెంట్ గా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. విజువల్స్, బీజీఎం అన్నీ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో గ్లింప్స్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అప్పుడే ఒక నెటిజన్.. రణబీర్ పిక్ షేర్ చేస్తూ బీఫ్ తినేవాడు రాముడు పాత్ర పోషిస్తున్నాడంటూ పోస్ట్ పెట్టాడు.

అతడు రాముడు పాత్ర పోషించడమేమిటోనని మరొకరు కామెంట్ పెట్టాడు. అప్పుడే చిన్మయి స్పందించి కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చారని చెప్పాలి. దేవుడి పేరుతో ఒక బాబాజీ రేపులు చేయవచ్చని, భక్త్ ఇండియాలో ఎన్నికల్లో ఓట్లు కోసం పేరోల్ మీద బయటకు రావచ్చని, కానీ ఎవరో ఏదో తిన్నారు అంటే అదే పెద్ద సమస్య కాదు కదా అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధం అయిందనే చెప్పాలి. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. కొందరు చిన్మయి శ్రీపాదకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు సదరు నెటిజన్ కు సపోర్ట్ గా కామెంట్ చేస్తున్నారు..