‎Ramayana: రామాయణ మూవీ బడ్జెట్‌ గురించి అలాంటి కామెంట్స్ చేసిన నిర్మాత.. మీ ఊహకు కూడా అందదు!

‎Ramayana: దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ రామాయణ. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి వినిపించిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

‎ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయినా అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇకపోతే తాజాగా నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమా బడ్జెట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఇటీవల జరిగిన పాడ్‌కాస్ట్‌లో, నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. రామాయణంలోని రెండు భాగాలకు దాదాపు $500 మిలియన్లు, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ. 4000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

‎దీంతో రామాయణం అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు విడుదలైన భారతీయ చిత్రాల బడ్జెట్‌లు ఏవీ 1000 కోట్లు దాటలేదు. ఈ బడ్జెట్‌ తో రామాయణం ప్రపంచ సినిమాల్లో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీలలో ఒకటిగా కూడా మారనుంది. ఇప్పటివరకు ఈ చిత్రాల బడ్జెట్‌ రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాత చెప్పిన లెక్కలు చూస్తుంటే కళ్లు చెదిరేలా ఈ మూవీ ఉండబోతుందని అర్థం అవుతుంది. హాలీవుడ్‌ లోని ఇతర సినిమాల మాదిరిగానే రామాయణం కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20​కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని DC కామిక్స్‌ హిట్‌ చిత్రాలు బ్యాట్‌మన్, సూపర్ మెన్, వండర్ వుమన్ వంటి వాటితో పాటు మార్వెల్ సినిమాలకు తగ్గకుండా రామాయణ ప్రాజెక్ట్‌ రూపొందించాలని మేకర్స్ యోచిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. కాగా తాజాగా నిర్మాత మూవీ గురించి చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.