Chilblains: చలికాలంలో చర్మం పై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఈ వ్యాది సోకే అవకాశాలు ఎక్కువ..!

Chilblains: జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలి కాలంలో ఎక్కువగా దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, జలుబు వంటి సీజనల్ వ్యాధులు అందరిని ఇబ్బంది పెడుతుంటాయి. శీతాకాలం లో ఇలాంటి వ్యాధులు మాత్రమే కాకుండా కొత్త రకాల వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉంది. అటువంటి వ్యాధులలో చిల్ బ్లెయిన్ అను వ్యాధి కూడా వస్తుంది. ఈ వ్యాది గురించి చాలా మందికి అవగాహన ఉండదు.ఈ వ్యాధి యొక్క లక్షణాలు, దాని నివారణ చర్యలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చల్లటి గాలి పీల్చటం ద్వారా ఈ వ్యాది సోకుతుంది. ఈ వ్యాధి వల్ల కాళ్లు చేతులు వాపులు రావడం, శరీరంలో చిన్న రక్త కణాలు చిట్లడం, కాళ్ళు ,చేతులు, చెవి కింది భాగాన ఎర్రగా అవటం, నడవలేక పోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకినప్పుడు బుగ్గలు, కాళ్లు ,చేతులు ఎక్కువ వేడి పుట్టి దురద పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇలా అకస్మాత్తుగా చర్మం మీద దురద పెట్టినప్పుడు చేతి వేళ్లతో గొక కుండ మెత్తటి క్లాత్తో ఉపయోగించి మృదువుగా రుద్దాలి. దురద తగ్గించడానికి చాలా మంది వేడి కాపడం ఇంకా పని లేదు పడుకో పెడుతుంటారు ఇలా చేయడం వల్ల సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల ప్రయాణం చేసేటప్పుడు ఉన్ని వస్త్రాలను ధరించి కాళ్ళు ,చేతులు చలి గాలి తాకకుండా హ్యాండ్ గ్లౌస్, సాక్షులు ధరించాలి. ముఖ్యంగా బైక్ మీద ప్రయాణం చేసే వారు హెల్మెట్ ధరించి, వీలైనంతవరకూ చల్లటి గాలి తాకకుండా వస్త్రాలను ధరించాలి. ఇంట్లో కూడా కాళ్ళకి సాక్షులు ధరించి, శరీరానికి చల్లని నీటిని తగలకుండా జాగ్రత్త వహించాలి. అవసరం అయినప్పుడు మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లాలి. ఈ వ్యాధి సోకినప్పుడు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కాళ్లు చేతులు అందులో ఉంచాలి. సమస్య తీవ్రత అధికంగా ఉన్నప్పుడు డాక్టర్ ని సంప్రదించటం శ్రేయస్కరం.