Health Tips: వేసవికాలంలో తలెత్తే ఆరోగ్య సమస్యలకు చెరుకు రసంతో చెక్ పెట్టండిలా..!

Health Tips: వేసవి కాలం మొదలవటం వల్ల సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 10 గంటలు దాటిన తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేసవి కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను నియంత్రించడానికి కొన్ని పానీయాలు ఎంతో ఉపయోగపడతాయి. వేసవి కాలంలో శరీరానికి మేలు చేసే పానీయాలలో చెరుకు రసం కూడా ఒకటి.

వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలకు చెరుకు రసంతో చెక్ పెట్టవచ్చు. చెరుకు రసంలో కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం మరియు ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి . ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. చెరుకు రసం తాగటం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభించి నీరసం తగ్గిస్తుంది.

వేసవికాలంలో చెరుకు రసం తాగడం వల్ల అందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందించి ఎక్కువ సమయం శక్తివంతంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ చెరుకు రసం తాగటం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి.

కామెర్లు, క్యాన్సర్ వంటి సమస్యలను నివారించడానికి కూడా చెరుకు రసం ఎంతో ఉపయోగపడుతుంది. చెరుకు రసం లో ఉండే కొన్ని కారకాలు పచ్చ కామెర్లు వ్యాధిని తగ్గించటంలో ఉపయోగపడతాయి. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఒక గ్లాస్ చెరుకు రసం తాగటం మంచిది.