Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్ కి చెక్… వెలుగులోకి వచ్చిన నిజాలు!

Breaste Cancer:ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కొన్ని రకాల వ్యాధులలో క్యాన్సర్ కూడా ఉంది. ఇందులో రొమ్ము క్యాన్సర్ అనేది ఆడవారి మీద చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. WHO ఫిబ్రవరి 20 21 ప్రకటించిన ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి కొత్తగా 12 శాతం మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపింది. WHO లో రొమ్ము క్యాన్సర్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న ఆండ్రీ ఇల్లవీ మాట్లాడుతూ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణంగా వ్యాపిస్తున్న క్యాన్సర్ అని తెలిపారు. దీనిని బట్టి రొమ్ము క్యాన్సర్ తీవ్రత ఏ విధంగా ఉందో అంచనా వేయొచ్చు. దీనికి మందులు లేవా అంటే, రీసెంట్ గా జరిగిన ఆస్ట్రేలియా పరిశోధనలో దీనిని నయం చేయవచ్చు అని అంటున్నారు శాస్త్రవేత్తలు.

ముల్లును ముల్లుతోనే తీసినట్టుగా, తేనెటీగల విషం ఉపయోగించి రొమ్ము క్యాన్సర్ నయం చేయవచ్చని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు. పాము యొక్క విషాన్ని కూడా అనేక ఔషధాలలో వినియోగిస్తారు అని మనకు తెలిసిందే. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని హ్యారీ పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లోని శాస్త్రవేత్తలు 300 కంటే ఎక్కువ తేనెటీగలు, బంబుల్బీల విషాన్ని తీసుకుని పరీక్ష చేశారు. తేనె టీగలలో ఉండే విషం ట్రిపుల్ నెగటివ్, హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2 (HER2) లను కలిగి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల ఒక గంట లోపే రొమ్ము క్యాన్సర్ కణాలను పూర్తిగా నయం చేయగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటివరకు క్యాన్సర్ ట్రీట్మెంట్ లో క్యాన్సర్ కణాలతో పాటు ఇతర కణాల మీద కూడా ప్రభావం ఉండేదని, కానీ ఈ విషం వల్ల క్యాన్సర్ కణాల మీద మాత్రమే ప్రభావం చూపి నయం చేయగలదని శాస్త్రవేత్తలు తెలిపారు.

క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు తరచుగా ఇస్తున్న కీమోథెరపీతో పాటు ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ట్రీట్మెంట్ ను ల్యాబ్ లో పరిశోధించినప్పటికీ, దీనిని కృత్రిమంగా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మోఫిట్ క్యాన్సర్ సెంటర్ లోని పరిశోధకురాలు డాక్టర్ మారిలెనా టౌర మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ ను నయం చేయడానికి ఈ చికిత్సా ఎంతగానో ఉపయోగపడుతుంది అని.. కాకపోతే దీని మీద మరికొన్ని పరిశోధనలు చేసిన తర్వాత దీనిని ఉపయోగించడం మంచిది అని ఆమె తెలిపారు. ఈ నూతన ఆవిష్కరణ ఎంతో ప్రత్యేకమైనది అని, ఇది మార్కెట్లోకి అందుబాటులోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు… కానీ త్వరగా అందుబాటులోకి రావటం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆమె భావించారు.