ప్రస్తుతం తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక మీదనే అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవాలని అన్ని పార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయి. అందులో బిగ్ బాస్ 1 కంటెస్టెంట్, యాంకర్ కత్తి కార్తీక కూడా ఉన్నారు. ఆమె కూడా దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
అయితే.. ఆమెపై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అయింది. ఎన్నికల వేళ ఆమెపై చీటింగ్ కేసు నమోదు కావడంతో ఆమె అభ్యర్థిత్వంపై ప్రశ్నార్థకం నెలకొన్నది.
ఓ భూవివాదంలో వేలు పెట్టిన కత్తి కార్తీక, ఆమె అనుచరులు.. ఆ వివాదాన్ని సెటిల్ చేస్తామని.. బాధితుల నుంచి ఏకంగా కోటి రూపాయలు వసూలు చేశారట.
అమీన్ పూర్ లోని 52 ఎకరాల లాండ్ ను ఓ ప్రైవేటు కంపెనీకి ఇచ్చేందుకు.. కత్తి కార్తీక మధ్యవర్తిత్వం వహించారట. దాని కోసం తన దగ్గర నుంచి కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కింద తీసుకున్నట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.