P.T. Usha: పరుగుల రాణి పై పోలిసు కేసు

P.T. Usha: భారత దిగ్గజ అథ్లెట్, పరుగుల రాణిగా పేరొందిన పీటీ ఉషపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ బిల్డర్ తో కలిసి పీటీ ఉష తనని మోసం చేసినట్లు కేరళలోని మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ తాజాగా ఫిర్యాదు చేసింది. దాంతో.. కేసు నమోదు చేసిన వెల్లయిల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ అసలు ఏం జరిగింది అంటే.? వివరాల్లోకి వెళ్తే..

కోజికోడ్ లో ఓ బిల్డర్ నుంచి 1,102 చదరపు అడుగుల ప్లాట్ ని పీటీ ఉష హామీ మేరకు జెమ్మా జోసెఫ్ కొనుగోలు చేసింది. ఆ ప్లాట్ ధర రూ. 46 లక్షలు కాగా.. వాయిదాల పద్దతిలో జెమ్మా జోసెఫ్ చెల్లించింది కానీ.. ఆ ప్లాట్ ని తన పేరిట బిల్డర్ రిజిస్ట్రేషన్ చేయించకుండా జాప్యం చేస్తున్నాడంటూ జెమ్మా జోసెఫ్ తాను ఇచ్చిన పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. బిల్డర్ జాప్యం చేస్తున్న విషయాన్ని పీటీ ఉష దృష్టికి తీసుకెళ్లినా.. ఆమె పట్టించుకోలేదని పోలిసుల ఫిర్యాదులో జెమ్మా జోసెఫ్ వెల్లడించింది. దాంతో.. విసుగు చెందిన జెమ్మా జోసెఫ్ పీటీ ఉష, బిల్డర్ తో పాటు మరో నలుగురు పైన చీటింగ్ కేసు నమోదు చేసింది. మొత్తం అరుగురిపైనా 420 కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.