రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించేవి ఏంటని అంటే ఆలోచించకుండా ఠక్కున సమాధానం వచ్చేవి రెండు విషయాలు.. అందులో ఒకటి కులం, రెండు మతం.. ఈ రెండు కూడా నాయకులను గానీ ఓటర్లను గానీ తీవ్రంగా ప్రభావితం చేస్తాయని అనడంలే సందేహం లేదు.. ఇప్పటి వరకు ఈ రెండు పదాలను ఆయుధంగా వాడుకుని రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులు ఉన్నారు.. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ఏపీలో జరిగిన మత వివాదాలు ఇప్పుడిప్పుడే సర్ధుకుంటున్నాయని అనుకునే సమయంలో మరోసారి ఈ ముచ్చట తెర మీదికి వచ్చింది.. అదేమంటే తిరుమల డిక్లరేషన్ విషయంలో సీఎం వైఎస్ జగన్ ఇది వరకు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెల్సిందే.. అయితే దానికి సమాధానంగా శ్రీవారికి సంప్రదాయ పద్దతిలో పట్టువస్త్రాలు సమర్పించి వివాదాన్ని సద్దుమణి గేలా చేశారు..
అయితే ఈ విషయాన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి మరోసారి తెరపైకి తెచ్చారు.. ఏపీ సీయం వైఎస్ జగన్ ఇష్టం వచ్చిన విధంగా డిక్లరేషన్ ఇవ్వకుండా భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని, దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలోని వివిధ అంశాలపై స్పందించిన కరాటే కళ్యాణి ఫస్ట్ టైం ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని రెండో వారానికి బయటకు వచ్చేసిన కరాటే కళ్యాణి, పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఫేమ్ సంపాదించుకునే పనిలో పడింది..
ఇంత వరకు బాగానే ఉన్నా ఆమె రాజకీయాల్లోకి వెళ్లుతుందనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఇందుకోసం ఇప్పటి నుండే కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.. కాగా కరాటే కళ్యాణి త్వరలో బీజేపీలో చేరనుందనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇలా మాట్లాడటం వల్ల ఒకింత ఫ్రీ పబ్లిసిటీ అవుతుందనే అని కొందరు వైసీపీ నాయకులు అంటున్నారట.. ఒకవైపు కేంద్రంతో సఖ్యతగా ఉంటున్న వైఎస్ జగన్‌ను, బీజేపీలో చేరబోతున్న కరాటే కళ్యాణి అకస్మాత్తుగా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న కారణం ఏంటో ఆమెకే తెలియాలి అంటున్నారట ఈ విషయం తెలిసిన మరికొందరు వైఎస్ జగన్ వర్గీయులు..