Vaccine: కోవిడ్ మహమ్మారి రాకతో ప్రజలoదరిలోనూ భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ఎంతోమంది కోవిడ్ కారణంగా మృత్యువాత పడ్డారు. మరికొందరు కోలుకొని వారి ఇంటికి వెళ్లారు. కానీ కోవిడ్ మాత్రం తగ్గలేదు. వ్యాక్సిన్ రాకతో కోవిడ్ మహమ్మారి నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చని ప్రజలలో నమ్మకం పెరిగింది.
అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక కణాలు పెరుగుతాయని వైద్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పరిశోధనలకు సంబంధించిన వివరాలను బ్రెయిన్, బిహేవియర్, ఇమ్యూనిటీ పత్రికలో ప్రచురితమయ్యాయి. దీనిని కనుగొనడం కోసం మూడు విధాలుగా ప్రయోగాలను చేశారు. అందులో మొదట కొంతమందిని గంటన్నర పాటు వ్యాయామం చేయించారు, మరి కొంతమందిని అర్ధ గంట పాటు వ్యాయామం చేయించారు, ఇంకా మరి కొంతమందిని మాత్రం ఎలాంటి వ్యాయామం లేకుండా ఉంచారు. అవి ఎలాంటి వ్యాయామాలు అనగా నడవడం, సైక్లింగ్ చేయడం,సూర్యనమస్కారాలు చేయడం వంటి తేలికపాటి వ్యాయామాలు
కొన్ని రోజుల తర్వాత వీరికి పరీక్షలు చేయగా మొదట గంటన్నర పాటు చేసిన వారిలో ఎక్కువగా రోగనిరోధక కణాలు ఉన్నాయని, అస్సలు వ్యాయామం చేయని వారిలో రోగనిరోధక కణాలు తక్కువ శాతం ఉన్నాయని, అర్ధ గంట పాటు చేసిన వారిలో గంట పాటు చేసిన వారికన్నా తక్కువ రోగనిరోధక కణాలు ఉన్నాయని వైద్యులు వారు చేసిన ఈ ప్రయోగం ద్వారా బయటపడిందని శాస్త్రవేత్తల్లో ఒకరైన కోహట్ ఈ విషయాన్ని తెలిపారు. ఇలా వ్యాక్సిన్ వేయించుకొన్న తర్వాత వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఒక రకమైన ప్రొటీన్ యాంటీబాడీ, ఈ కణాలు ఉత్పత్తి అయ్యేందుకు తోడ్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.