రాజకీయాల్లో నాయకులు మారిన, పార్టీలు మారిన, కొత్త వారు వచ్చినా ఎప్పుడు జరిగే తంతు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారపక్షాన్ని, అధికార పార్టీలో ఉన్న వారు ప్రతిపక్షం చేసిన బొక్కలను వెతుకుతూ ఒకరినొకరు విమర్శించుకుంటూనే ఉంటారు.. ఇందులో విచిత్రం ఏంటంటే అప్పటి వరకు వారున్న పార్టీ నుండి వేరే పార్టీలోకి జంప్ అయిన తర్వాత ఇంతవరకు నీడ నిచ్చిన పార్టీలోని తప్పులు నాయకులకు కనిపించడం మరీ విడ్డూరం.. అంటే తాను ఆ పార్టీలో ఉన్నంత వరకు ఆ తప్పులు తనకేమి పట్టనట్లుగా ఉన్న వారు ఒక్క సారిగా పార్టీ మారగానే పులుల్లాగా మారుతారు జనానికి చెవిలో పువ్వులు పెట్టడానికి.. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నది ఇదేనటా..
ఇదివరకు బీజేపీతో దోస్తాన్ చేసిన చంద్రబాబు, పొత్తు కలవలేదో, పొంతన కుదరలేదో తెలియదు కానీ జనసేనతో జట్టు కట్టాడు.. మరి అక్కడ ఏం చెడిందో తెలియదు గానీ ఏకపక్షంగానే అధికార పార్టీ అయినా వైసీపీ మీద ఒంటరిగా పోరాడుతున్నాడు. కాగా ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు.. రానున్న అతికొద్ది కాలంలో కుప్పం ఎమ్మెల్యేగా మిగిలిపోబోతున్నారనే ప్రచారం రోజురోజుకీ రాజకీయవర్గాల్లో ఎక్కువ అవుతుందట.. ఇలాంటి పరిస్దితుల్లో తన ఉనికిని, పార్టీ పరువును కాపాడటానికి బాబు లక్ష్యం మారిపోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇకపోతే నిన్నమొన్నటి వరకూ వైసీపీ పార్టీ పరువు గంగలో కలిపి జగన్ ని ఓడించడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు సడెన్‌గా రూటు మార్చాడట. మళ్ళీ బీజీపీకి దగ్గరైయ్యే ప్రయత్నాలు ముమ్మురం చేశాడట. ఏమాత్రం అవకాశం ఉన్నా.. బీజేపీ నేతలు అడిగినా అడగకపోయినా.. ప్రభుత్వానికి కేంద్రంలో మద్దతులు ప్రకటించేయమని చెబుతున్నారంట. అంతేకాదు కేంద్రప్రభుత్వం సభలో ఏ బిల్లు పెట్టినా వెనకా ముందూ చూడకుండా చేతులు ఎత్తేయాలని తమ ఎంపీలకు సూచిస్తున్నారంట. ఇలా ఎందుకంటే జగన్‌ను తాను ఒంటరిగా ఎదుర్కోవడం బాబుకు పెద్ద సాహాసంలా తోస్తుంది.. అందుకే తన టార్గెట్ బీజేపీని ప్రసన్నం చేసుకుని మోదీ గారి సపోర్ట్ తీసుకోవాలి.. ఇది జరగాలంటే వైఎస్ జగన్‌కు బీజేపీకి చెడాలి అందుకే ఆరునూరైనా నూరు ఆరైనా సరే.. సీయం జగన్, మోడీ మధ్య ఏదోలా అయినా పుల్లలు పెట్టి.. ఎన్నికల నాటికి తాను మోడీ సరసన చేరాలని తపిస్తున్నారంట టీడీపీ అధినేత.. ఏది ఏమైనా రాజకీయ జిమ్మిక్కులు మరి ఇంత ఇదిగా ఉంటాయా అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన జనాలు..