ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ వార్డు..సచివాలయాలు..వాలంటీర్లు అనే ఓ పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఈ వ్యవస్తే జగన్ కి అత్యంత కీలకంగా మారబోతుంది. సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రతిపక్షానికి కూడా ఈ సేవలు ఎంతో అవసరమైనవే. అయితే జగన్ సృష్టించిన ఈ ప్రభుత్వ సామ్ర్యాజ్యాన్ని టీడీపీ ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలుగా ( వాలంటీర్లు కాకుండా) గుర్తించడం లేదు. వీళ్లందర్నీ జగన్ బ్యాచ్ గానే టీడీపీ ఇన్నాళ్లు ట్రీట్ చేస్తూ వచ్చింది. అవకాశం వచ్చిన ప్పుడల్లా విమర్శలు గుప్పించింది తప్ప ప్రశంసలు కురిపిచింది గానీ..గుర్తించింది గానీ జరగలేదు.
తాజాగా చంద్రబాబు చేసిన ఓ సూచన చూస్తుంటే ఆయనకు కూడా ఎక్కడో సాప్ట్ కార్న్ ఉన్నట్లే తెలుస్తోంది. రెడ్ జోన్లలో ఉన్నవారికి నిత్యావసర సరుకులను ఇళ్లకే పంపించాలని చంద్రబాబు సూచించడం విశేషం. జగన్ ఏడాది పాలనలో చంద్రబాబు ఏ రోజూ ఇలా స్పందించలేదు. కుదిరితే రాళ్లు..లేకపోతే విమర్శలు తప్ప మరో పనిలేకుండా చంద్రబాబు అండ్ కో పనిచేసింది. కానీ చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో చిన్న మార్పు కనిపిస్తుంది. మార్పు మంచిందే. అయితే ఇందులో వ్యూహం లేకుండా ఉంటే? ఎందుకంటే చంద్రబాబు ఏ చిన్న అస్ర్తం దొరికినా వదిలిపెట్టడు. తెలివిగా రాజకీయం చేయగల దిట్ట అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ కరోనా కష్టకాలంలో ఎలా? శ్రమిచిందో చెప్పాల్సిన పనిలేదు. కరోనా వస్తుందని జగన్ ముందు ఊహించారో! లేక యాదృశ్చికంగా జరిగిందో గానీ..ఆ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఏపీలో ఎంతో ఉపయుక్తంగా మారింది. మహమ్మారి ప్రబల్లితోన్న సమయంలో వాలంటీర్లు ఇంటింటికి తిరిగి నిత్యావసర సరుకులు అందించారు. కరోనాకి సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేర వేసి ప్రజల్ని అప్రమత్తం చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఈ వ్యవస్థ భవిష్యత్ లో మరింత బలంగా ఏర్పాటు కానుంది. ఒకవేళ జగన్ సృష్టించిన ఈ సామ్రాజ్యం లేకపోతే లాక్ డౌన్ సమయంలో పరిస్థితి ఎలా ఉండేదో! ఊహకే అందదు.