వైఎస్ జగన్ కు అండగా నిలిచిన చంద్రబాబు.. ??

babu jagan

 

తెలిసి చేసిన తెలియక చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్ జగన్‌కు చాలా మేలు చేస్తున్నారని అనుకుంటున్నారట వైసీపీ నాయకులు.. అసలే మచ్చలేని పాలనను అదేనండి అవినీతి మరక అంటని పరిపాలన అందిస్తానని బహిరంగంగా ఈ యువ సీయం చెప్పారు.. కానీ ప్రజా సంక్షేమంలో పడి ఆ మాట మరచినట్లుగా ఉన్నారట.. ఇదే సందుగా భావించిన కొందరు అధికార పార్టీ నాయకులు అడ్దదారుల్లో సంపాదనకు అలవాటుపడ్డారట.. ఇక ప్రతిపక్ష నేతగా ఉన్న బాబుగారు ఊరికే ఉంటారా.. ఉండరు కదా.. మరి ఏం చేశారో తెలుసుకుంటే..

వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఎనిమిదేళ్ల పాటు పోరాటం చేసిన తర్వాత అధికారం దక్కింది. ఈ క్రమంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా అభివృద్ధి పనులను పక్కన పెట్టి సంక్షేమ పథకాలకే నిధులు వెచ్చిస్తున్నారు. దీనివల్ల అభివృద్ధి పనులు ఆగిపోయినాయి.. ఇక దండిగా ఖర్చుపెట్టి ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి గిట్టుబాటు కావడం లేదట.. కనీసం గత ఎన్నికల్లో పెట్టిన ఖర్చును కూడా రాబట్టుకోలేక ఇసుక దందాను వరంగా మార్చుకున్నారట.. ఇలా అనేక మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న స్థానిక అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటం ఒక ఎత్తైతే ఇదే విషయాన్ని చంద్రబాబు పేర్లతో సహా చెప్పి విమర్శలు చేస్తుండటంతో వైసీపీ ఎమ్మెల్యేల దూకుడుకు అడ్డుకట్ట వేసినట్లు అయ్యిందట..

చంద్రబాబు ఆరోపణలకు వైఎస్ జగన్ స్పందించి అక్షింతలు వేస్తాడేమో అని భావించిన ఎమ్మెల్యేలు ఇసుక దందాను దూరం పెట్టారట.. ఇక ఇళ్ల స్థలాల ఎంపిక విషయంలోనూ చంద్రబాబు చేస్తున్న విమర్శలు వైసీపీ ఎమ్మెల్యేలకు బాగానే తాకాయట. అవినీతి లేని పాలన అందిస్తానని వైఎస్ జగన్ చెప్పడం, చంద్రబాబు అదే అవినీతి పై ఆరోపణలు చేస్తుండటంతో ఎమ్మెల్యేలను వైఎస్ జగన్ కంట్రోల్ చేయాల్సి ఉండగా, చంద్రబాబు కట్టడి చేస్తున్నారని వైసీపీలో చర్చ జరుగుతుండటం విశేషం. ఇలా తెలిసో తెలియకనో వైఎస్ జగన్ అవినీతి రహిత పాలనకు అండగా చంద్రబాబు నిలిచారని అనుకుంటున్నారట..