చంద్రబాబు ‘ రాజీనామా ‘ డ్రామా – జగన్ ను అడ్డంగా ఇరికించాడు !

cm jagan chandrababu naidu telugu rajyam

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు కూడా రెడీగా ఉన్నామని ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా కాపాడేందుకు తాము రాజీనామాలు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనకు చంద్రబాబు మద్దతు పలికారు.

Vizag Steel Plant: విశాఖ ఉక్కు కోసం చంద్రబాబు సంచలన ప్రకటన

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీనామాలపై ప్రకటన చేశారు. ‘ఉక్కు పరిశ్రమ కోసం పల్లా శ్రీనివాస్ 6 రోజులు దీక్ష చేశారు. విశాఖకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రజల భావోద్వేగాలను ప్రభుత్వం తెలుసుకోవాలి. మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం మీరు ఏం చెప్పినా చేయడానికి మేం రెడీ. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాజీనామాలకూ మేం సిద్ధం.’ అని చంద్రబాబునాయుడు ప్రకటించారు

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పటికే విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఆ రాజీనామాపై మొదట విమర్శలు వచ్చాయి. ఆయన స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయలేదని వైసీపీ, బీజేపీ విమర్శించాయి. ఈ క్రమంలో ఆయన మరోసారి రాజీనామా చేశారు. దాన్ని జర్నలిస్టుల ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపారు. దీనిపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల భావోద్వేగానికి సంబంధించిన అంశం కావడంతో దీనిపై రాజకీయ వేడి రాజుకుంటోంది. తప్పు మీదంటే మీదంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను జగన్ చౌకధరకే కొట్టేద్దామనుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నాయి. అయితే, అసలు టీడీపీ హయాంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.