దుబ్బాక ఎన్నికలను చూసి బాబు బానే నేర్చుకున్నాడే!! తిరుపతి ఉప ఎన్నికకు మాస్టర్ ప్లాన్ వేశాడుగా!!

cbn

2020లో జరుగుతున్న వింతలు, విచిత్రాలలో దుబ్బాక ఉప ఎన్నిక కూడా ఒకటి. టీఆర్ఎస్ కు గండికోటలాంటి స్థానంలో బీజేపీ విజయాన్ని సాధించింది. ఇందుకు టీఆర్ఎస్ యొక్క పాలన లోపమని, అలాగే 2018లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఎప్పుడు ప్రజాక్షేత్రంలోనే బీజేపీ అభ్యర్థి రఘునందన రావు ఉండేవారు. ఇలాంటి విషయాలు బీజేపీని ఎన్నికల్లో గెలిపించాయి.

cbn
cbn

అయితే ఈ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను పూర్తిగా మార్చాయి. ఈ ఎన్నికల ఫలితాలను చూసి రాజకీయ నాయకులు నూతన రాజకీయ పాఠాలను నేర్చుకుంటున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా దుబ్బాక ఎన్నికల నుండి నేర్చుకున్న పాఠాలను తిరుపతి ఉప ఎన్నికల సమయంలో వాడుతున్నారు.

తిరుపతి ఉప ఎన్నికలు ఏపీలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికలను ఇప్పటి వరకు సాగిన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు సంకేతంగా చూస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే వైసీపీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. తిరుపతి ఉప ఎన్నికలో గెలవడానికి చంద్రబాబు నాయుడు దుబ్బాకలో బీజేపీ ఫాలో అయిన స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు.

ఎన్నికలు ఎప్పుడో ఫిబ్రవరిలో జరగనున్నాయి కానీ బాబు అప్పుడే టీడీపీ తరపున నిలబడే అభ్యర్థిని ప్రకటించాడు. సానుభూతి కోసం గతంలో ఓడిపోయినా పినబాక లక్ష్మిని మళ్ళీ పోటీకి దింపనున్నారు. అలాగే ఇప్పటి నుండే లక్ష్మిని ప్రజాక్షేత్రంలో ఉండేలా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్న బీజేపీకి క్యాండిడేట్ సమస్య ఉండనే ఉంది. దాంతో వైసీపీ వ్యతిరేక ఓట్లు ముందుగానే తమ వైపు మళ్ళించుకోవడానిక్ చంద్రబాబు పన్నిన వ్యూహంగా ఇదని చెబుతున్నారు. మొత్తానికి తిరుపతి లడ్డూ మీదనే బాబు కన్నేశారని అర్ధమవుతోంది.