ఇప్పటికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారానికి చాలా అలవాటు పడ్డారు. ఇప్పుడు సడన్ గా 2019 ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓటమిపాలు అయ్యి అధికారాన్ని కోల్పోయారు. ఇప్పుడు అధికారం చేతిలో లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిత్యం ఆరోపణలు చేస్తూ, విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు వస్తాయని, అందులో విజయం సాధించి మళ్ళీ అధికారం చేపట్టాలని చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారు.
కేంద్రం జమిలి ఎన్నికలు నిర్వహించనుందా !
కేంద్రం కూడా జమిలి ఎన్నికలు నిర్వహించడానికి గతంలో సన్నాహాలు కూడా చేసింది. అయితే దేశంలోకి కరోనా రావడంతో ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకుంది. దేశ ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్న నేపథ్యంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆసక్తి చూపడం లేదు. కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు చంద్రబాబు యొక్క జమిలి ఎన్నికల కలను కూడా నాశనం చేసింది.
జమిలి ఎన్నికలు వస్తే వైసీపీ సిద్ధంగా ఉందా!
దేశంలో జమిలి ఎన్నికలు వస్తే గెలుపు తమదేనని, వైసీపీ ప్రభుత్వం యొక్క పాలనకు చూసిన ప్రజలు తమకు పట్టం కడుతారని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. వైసీపీ అధికారం చేపట్టి కొన్ని రోజులకే కరోనా రావడంతో పాలన ఒక రకంగా స్తంభించిపోయింది. కరోనా వల్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను అనుకున్న నిర్ణయాలను, చేయాలనుకున్న పనులు చేయలేకపోయారు. తన పాలన యొక్క నైపుణ్యం కరోనా వల్ల బయటపెట్టలేకపోయారు. అలాగే కరోనా విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ప్రజలు కూడా భావిస్తున్న నేపథ్యంలో వైసీపీ జమిలి ఎన్నికలకు సిద్ధంగా లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.