దేశంలో జమిలి ఎన్నికల కోసం కలలు కంటున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే. ఆయన మాట్లాడిన ప్రతిసారి కనీసం ఒక్కసారైనా జమిలి ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ 16 నెలల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్. రెడ్డి పాలనను చూసిన ప్రజలను తననే గెలిపిస్తారని చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా నమ్ముతున్నారు. 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని బాబు చాలా గట్టిగా చెప్తున్నారు.
వైసీపీ నేతలను ఆకర్షించడానికేనా!
చంద్రబాబు నాయుడు ఇలా ప్రతిసారి జమిలి ఎన్నికల గురించి మాట్లాడటం వెనక ఒక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇలా జమిలి ఎన్నికల గురించి మాట్లాడితే వైసీపీలో ఉన్న అసంతృప్తి నాయకులను ఆకర్షించడానికే ఈ ప్రచారం అని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కానీ, ఆ పరిస్థితి వైసీపీలో వుందా.? అన్నదే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని చూస్తే, జమిలి.. అన్న ఆలోచన కష్టంగానే కనిపిస్తుంది. కేంద్రంలోని మోడీ సర్కార్‌కి ఐదేళ్ళ కంటే ముందే ఎన్నికలకు వెళ్ళాలనే అత్యుత్సాహమైతే వుండకపోవచ్చు.
జమిలి ఎన్నికల్లో బాబు గెలుస్తాడా!
జమిలి ఎన్నికల కోసం ఇంతలా ఎదురు చూస్తున్న బాబు ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే గెలుస్తాడా అనే ప్రశ్నలు టీడీపీలోనూ, వైసీపీలోను వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం జమిలి ఎన్నికలు వచ్చినా కూడా చంద్రబాబు గెలవడం చాలా కష్టమని,జగన్ ప్రభుత్వం ఇప్పుడే ప్రజల్లో ఓడించేంత స్థాయిలో వ్యతిరేకత రాలేదని చెప్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం జమిలి ఎన్నికల కోసం ప్రతిరోజు కలలు కంటున్నారు. బాబు కలలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.