చంద్రబాబు చేస్తున్న ఈ తప్పులే వైఎస్ జగన్‌కు కలసి వస్తున్నాయా.. ?

babu jagan

 

హైటెక్ ఆలోచనలతో అందర్ని మెప్పించి తన రాజకీయ అనుభవంతో తిరుగులేని నాయకునిగా ఎదిగా అని భ్రమపడుతున్న చంద్రబాబు గారు ఒక్క సారి ఆలోచించుకోండి.. అసలు టీడీపీని మీరు భూస్దాపితం చేద్దామని కంకణం కట్టుకున్నారా? అన్న ఎన్‌టీయార్ గారు ప్రతిష్టాత్మకంగా భావించి అపురూపంగా చూసుకున్న ఈ పార్టీ నేడు పాడేపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో బ్రతికించవలసింది పోయి అర్ధం పర్ధం లేని అనాలోచిత నిర్ణయాలతో ఘనమైన చరిత్ర కలిగిన టీడీపీని అపఖ్యాతి పాలు చేస్తున్నారంటూ కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు లోలోపల కుమిలిపోతున్నారట..

అదీగాక అన్న ఎన్‌టీయార్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.. అంతే కాదు అప్పట్లో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మట్టుకు తెలుగుదేశం విజయం వలన, అప్పటి లోక్‌సభలో కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షమయింది.. ఇలాంటి చరిత్రను మట్టిలో కలిపేసి ప్రస్తుతం పనికిరాని రాజకీయాలను నాయకుల పై రుద్దుతున్న బాబు గారు ఇకనైనా మేలుకోండని కొందరు పచ్చ తమ్ముళ్లు చెబుతామని చెప్పలేకపోతున్నారట..

ఇక టీడీపీ సర్వనాశనం అయ్యిందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.. అందులో నెల్లూరు జిల్లా ఒకటి.. ఈ జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిపోయిన తర్వాత ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీకి దిక్కూ దివానం లేకుండా పోయిందంటున్నారు అదీగాక ఇక్కడ టీడీపీ నేతలు మాత్రం కన్పించడమే మానేశారట. ఎప్పటికప్పుడు అభ్యర్థులను మారుస్తూ పోతుండటంతో టీడీపీకి ఇక్కడ నిలకడగల, నికార్సయిన నేత లేకుండా పోయాడంటున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తున్న తప్పిదాలేనని ప్రచారం జరుగుతుందట..

ఇకపోతే కాంగ్రెస్ నుంచి ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ వేలు పట్టుకోగానే అప్పటి వరకూ పార్టీ కోసం పనిచేసిన కన్నబాబును పక్కన పెట్టేసి, ఆనం కు బాద్యతలు అప్పగించారు. దీంతో అప్పటి వరకూ కన్నబాబు వెంట ఉన్న వారు ఆనం వెంట వెళ్లలేక వైసీపీలోకి దారి కట్టారంటున్నారు.. ఇక మొన్నటి ఎన్నికల్లో మరలా టీడీపీ టిక్కెట్ ఆర్థికంగా బాగా ఉన్న నేత బొల్లినేని కృష్ణయ్యకు దక్కింది.

కేవలం ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేస్తారనే ఆలోచనతో టీడీపీ అధిష్టానం ఆయనకు టిక్కెట్ ఇచ్చిందట. కానీ వ్యాపారవేత్త అయిన బొల్లినేని కృష్ణయ్య ఎన్నికల ఫలితాల నుంచే నియోజకవర్గానికి రావడం మానేశారు. పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహించడం లేదు. దీంతో మళ్లీ కన్నబాబే దిక్కయ్యాడు. ఇలా బయటి వ్యక్తులకు టిక్కెట్లు ఇస్తూ పోతుండటంతో ఇక్కడ టీడీపీ ఇక ఎదిగే అవకాశాలు లేవని, వైసీపీకి, వైఎస్ జగన్‌కు ఈ అంశాలే కలసి వస్తున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజలకు అందుబాటులో ఉండేవారిని ఇన్ ఛార్జులుగా నియమిస్తే బాగుంటుందని ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ నేతలు కోరుకుంటున్నారట.