బాబుగారు చేయని రాజకీయమా ఇది.. ఎందుకీ బాధ ఆయనకు 

Chandrababu Naidu to do repairs to Kuppam
పంచాయతీ ఎన్నికల్లో ఇన్ని సీట్లొచ్చాయి అన్ని సీట్లొచ్చాయి అంటూ రాజకీయ పార్టీలు ఎవరికి వారు లెక్కలు చెప్పుకుంటున్నారు.  చంద్రబాబు నాయుడు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి పేపర్లు పట్టుకుని ఇన్ని స్థానాల్లో గెలిచాం అంటుంటే వైసీపీ నేతలేమో ఆయనకు కౌంటర్ ఇవ్వడానికి ఇదిగో మాదే విజయం అంటూ ఆధారాలు చూపిస్తున్నారు.  పంచాయతీ ఎన్నికల సంప్రదాయం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.  పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా అధికార పార్టీదే పైచేయిగా ఉంటుందనేది వాస్తవం.  ఒకవేళ ప్రతిపక్షం ఎక్కువ శాతం స్థానాలు గెలిచినా కూడ పూట గడిచేసరికి వారిలో ఎంతమంది ప్రతిపక్షం వైపునే ఉంటారనేది చెప్పడం  కష్టం.  ఈరోజు కాకపోయినా నిత్యం ప్రతిపక్ష పార్టీని వీడేవారు ఉంటూనే ఉంటారు.  ప్రస్తుతం జరుగుతున్నదీ అదే. 
 
Chandrababu doing useless show
Chandrababu doing useless show
ఎన్నికల్లో తెలుగుదేశం మద్దతుదారులు పర్వాలేదని స్థాయిలోనే గెలుస్తున్నారు.  అంతిమంగా వైసీపీదే మెజారిటీ అయినా టీడీపీకి చెప్పుకునే స్థాయిలోనే స్థానాలు  వస్తున్నాయి.  గెలిచిన వీరంతా టీడీపీకే జైకొడతారా అంటే లేదు.  ఇప్పటికే అధికార పార్టీ ఒత్తిళ్లు మొదలయ్యాయి.  చాలామంది కండువాలు మార్చేస్తారు.  ఎన్నికలు ముగిసిన వారం పదిరోజులకుగాను ఏ పార్టీలో ఎంతమంది ఉన్నారో చెప్పలేం.  మరి ఇదంతా చంద్రబాబు నాయుడుగారి తెలియదా అంటే తెలుసు.  ఒకప్పుడు ఆయన కూడ ఇదే తరహా రాజకీయం చేసినవారే.  అధికారంలో ఉండగా ప్రతిపక్షం ఎమ్మెల్యేలను ఎలా లాగేశారో అందరం చూశాం.  అప్పుడు జగన్ గగ్గోలు పెట్టారు.  అయినా చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ ఆపలేదు.  మొత్తంగా 23మంది ఎమ్మెల్యేలను తన్నుకుపోయారు. 
 
అలా ఉత్త పుణ్యానికి ఎమ్మెల్యేలను లాగేసిన ఆయన ఈరోజు సర్పంచులు, వార్డు మేంబర్లను వైసీపీ లాక్కుంటోందని, ఇది అన్యాయమని, బెదిరించి, ఆశజూపించి తమవైపుకు తిప్పుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.  తనదాకా వస్తే కానీ బాధేంటో తెలియదన్నట్టు పంచాయతీ ఎన్నికల్లోనే బాబుగారికి చుక్కలు కనిపించేస్తున్నాయి.  లోకల్ బాడీ ఎలక్షన్లు అంటేనే ఇంతే.  ఎప్పుడు ఎవరు ఏ పార్ట్టీలోకి పోతారు చెప్పడం కష్టం.  వందల సంఖ్యలో ఉండే లోకల్ లీడర్లను పట్టి ఉంచడం దాదాపు అసాధ్యం.  చివరకు అధికార పార్టీదే మెజారిటీ అవుతుంది.  ఇప్పుడు జరుగుతున్నదీ అదే.  అన్ని దశ ఎన్నికలు ముగిశాక 70 శాతం విజయం వైసీపీదే ఉంటుంది.  అయినా బాబుగారు ఏదో ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి తాపత్రయపడుతున్నారు.  అధికార పార్టీ మీద విమర్శలు  గుప్పిస్తున్నారు.