ఇది మా కంచుకోట అని బాలయ్య చెప్పుకునే ప్లేస్ లో చావుదెబ్బ కొట్టిన చంద్రబాబు

chandrababu-did-mistake-in-hindupur
రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితిలో ఉందనేది వాస్తవం.  గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు, పయ్యావుల కేశవ్ మినహా మిగతా టీడీపీ లీడర్లంతా చిత్తుగా ఓడిపోయారు.  సీమ పూర్తిగా వైసీపీ వశమైంది.  మొదటి నుండి కడప సహా సీమ జిల్లాలు అన్నింటిలోనూ వైఎస్ కుటుంబం హవా ఉంటూనే ఉంది.  గత ఎన్నికల్లో అది రెట్టింపు స్థాయిలో కనబడింది.  దీంతో తెలుగుదేశంలో గట్టి నాయకులు అనబడేవారు కూడ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.  కొందరు వైసీపీని ఢీకొట్టలేక తోకముడిస్తే ఇంకొందరు స్వీయ భద్రత కోసం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  అసలు పరిటాల, జేసీ కుటుంబాలే ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాయంటే వారి మీద జగన్ ప్రభావం ఏ స్థాయిలో పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు.  
 
chandrababu-did-mistake-in-hindupur
chandrababu-did-mistake-in-hindupur
ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఊహించని ఓటమిని మూటగట్టుకుంది.  జిల్లా నుండి హిందూపురం నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ గెలిచింది.  అది కూడ బాలకృష్ణ ఇమేజ్ వల్లనే.  టీడీపీ అంత ఘోరంగా ఓడిపోయినా బాలకృష్ణ మాత్రంగాత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీ తెచ్చుకుని గెలిచారు.  దాంతో హిందూపురం టీడీపీకి, బాలయ్యకు కంచుకోటలా పేరుపడింది.  బాలకృష్ణ సైతం మిగతా నియోజకవర్గాల్లో ఉన్న నేతల్లా వచ్చే ఎన్నికల కోసం ఆలోచించే రకం కాదు.  ఎందుకంటే ఆయనకు గెలుపు మీద నమ్మకం ఉంది. హిందూపురం తనదనే ధీమా ఉంది.  ఆఫ్ థి రికార్డ్ పలుమార్లు హిందూపురం తనకు పెట్టని కోట అని బాలయ్య చెప్పుకున్నారు.  ఇప్పుడు అలాంటి చోటే ముసలం మొదలైంది. 
 
అనంతపురం జిల్లాలో టీడీపీ పరిస్థితు నానాటికీ దిగజారిపోతోంది.   ఓటమి తర్వాత జిల్లాలో పార్టీ నేతలు సైలెంట్ గా ఉన్న సమయంలో చంద్రబాబు పార్టీ కమిటీలు ప్రకటించి నేతల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.  ఈ క్రమంలో గతంలో అనంతపురం జిల్లాలో మాజీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బి.కె పార్థసారథికి హిందూపురం పార్లమెంటు పార్టీ బాధ్యతలు అప్పగించారు.  అయితే చాలామందిలోకి పార్థసారథి నాయకత్వం నచ్చట్లేదట.  లోక్ సభ పరిధిలో ఉన్న పలువురు నేతలు ఆయనతో కల్సి పనిచేయడానికి సుముఖంగా లేరు.  దీంతో లోక్ సభలో పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతోంది.  బాలయ్య అసెంబ్లీలో కూడ ఈ వాతావరం ఉంది.  ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హిందూపురాన్ని కూడ టీడీపీ కోల్పోవాల్సి వస్తుంది.