ఏపీలో టీడీపీ పుంజుకోవాలనేది చంద్రబాబు మనసులో ఉన్న ఆశ.. ఇప్పటికే చేయి జారిపోయిన నేతల విషయం పక్కన పెడితే ఇక ముందున్న నేతలను కాపాడుకుంటూ, బలహీనంగా మారిన సైకిల్‌ను జెట్ స్పీడ్ రేంజ్‌లో ముందుకు తీసుకెళ్లాలని లోలోపల తపనపడుతున్నాడట.. ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా ప్రచారం సాగుతుంది.. ఈ క్రమంలో బాబు మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్న పరిటాల కుటుంబం చేయి జారిపోకుండా చూసుకుంటున్నాడట.. అంతే కాకుండా నేతలను మచ్చిక చేసుకునెందుకు ఇటీవలే పార్లమెంటరీ జిల్లాలకు కమిటీలను కూడా ఏర్పాటు చేసి, సుమారుగా పాతిక మందికి పదవులు ఇచ్చారు. అదేసమయంలో రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఒక సమన్వయ కర్తను ఏర్పాటు చేశారు.. ఇలా చేయడం వల్ల మరో 13 మందికి పదవులు దక్కాయి. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు టీడీపీనే నమ్ముకుని ఉన్నా ఇంత వరకు గుర్తింపు లేదని బాధపడుతున్న నాయకులకు కూడా చంద్రబాబు ఈ దఫా ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.
ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పార్టీకి అండగా ఉంటున్న పరిటాల రవి కుటుంబానికి చంద్రబాబు కీలక పదవులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ఇందులో భాగంగా దేవినేని అవినాష్.. ఖాళీ చేసిన.. తెలుగు యువత పగ్గాలను పరిటాల శ్రీరాంకు ఇవ్వాలని బాబు భావిస్తున్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే టీడీపీని వీడితే బాగుండు అనే ఆలోచనలో ఉన్నట్లుగా పరిటాల కుటుంబం చెప్పకనే చెప్పింది.. దీని వల్ల ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పసిగట్టిన బాబు పరిటాల కుటుంబం రెండేళ్లుగా కోరుతున్న పెనుకొండ నియోజకవర్గం బాధ్యతలు కూడా అప్పగించేందుకు రెడీ అవుతున్నట్టు సీనియర్లు చెబుతున్నారు. పస్తుతం రాప్తాడు బాధ్యతలను కూడా పరిటాల కుటుంబమే చూస్తోంది..
అయితే గత ఏడాది ఎన్నికల్లో శ్రీరాంకు ఇక్కడ ఛాన్స్ ఇవ్వగా ఆయన ఓటమి పాలయ్యారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే తమకు పెనుకొండ, రాప్తాడు ఇవ్వాలని ఈ కుటుంబం పట్టుబట్టింది. దీనికి కారణం లేకపోలేదు.. రవికి అనుకూల వర్గం ఎక్కువగా అదేమంటే పెనుకొండలో ఉంది.. అదీగాక పరిటాల రవి పలుమార్లు విజయం సాధించిన చరిత్ర ఉండడంతో శ్రీరాంను గత ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేయించాలని సునీత భావించారట.. కానీ, చంద్రబాబు వారి ప్లాన్‌ను తిరగరాశాడు.. ఈ నేపథ్యంలో బాబు తమను పట్టించుకోవడం లేదని ఒకింత అసహనంతో ఉన్న ఫ్యామిలీకి ఇప్పుడు తెలుగు యువత పోస్టు సహా.. పెనుకొండ పార్టీ బాధ్యతలను కూడా అప్పగించాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లూ పదవిలేక అల్లాడితే ఇప్పుడు ఏకంగా మూడు భాధ్యతలను అప్ప చెబుతున్నందుకు సంతోషించాలో, కొత్తగా ఎదురయ్యే సమస్యలతో తలనొప్పులు తెచ్చుకోవాలో అర్ధం కాని స్దితి నెలకొందట పరిటాల ఫ్యామిలీలో.. కాగా పరిటాల రవి కి కూడా ఎప్పుడూ ఇలాంటి ఛాలెంజ్ ఎదురు కాలేదట..