బీజేపీ వైసీపీ పొత్తు వైపు ఆశగా చూస్తున్న చంద్రబాబు

babu modi jagan telugu rajyam

  ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ లో ప్రధాని మోడీతో సమావేశం అనగానే మోడీ ముందు రాష్ట్ర సమస్యలు గురించి సీఎం జగన్ ఏమేమి మాట్లాడబోతున్నాడు అనే విషయాలు కంటే కూడా, NDA కూటమిలో జగన్ చేరబోతున్నాడా..? చేరితే ఎన్ని కేంద్ర మంత్రి పదవులు రాబోతున్నాయి అనే విషయం మీదే అనేక చర్చలు జరిగాయి. వైసీపీ పార్టీ NDA కూటమిలో చేరితే ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీకి కలిగే నష్టం గురించే ముఖ్యంగా మాట్లాడుకున్నారు. అయితే టీడీపీకి నష్టం ఎంత జరుగుతుందో, అదే స్థాయిలో లాభం కూడా జరిగే అవకాశం వుంది.

cm jagan pm modi telugu rajyam

 

  సీఎం జగన్ మాత్రం మోడీతో అధికారంగా జతకడితే చంద్రబాబు నాయుడు పూర్తిగా రివర్స్ గేరు వేసే అవకాశం లేకపోలేదు. బీజేపీతో దోస్తీ దొరకలేదనే కసికి తోడు, జగన్ జతకట్టటంతో అది తారాస్థాయికి వెళ్ళిపోయి, హిందుత్వ అజెండా వదిలేసి మరోదారిలో బాబు ఎదురుదాడి చేసే అవకాశం వుంది. వైసీపీ పార్టీకి మైనారిటీ అండ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి పార్టీ వెళ్లి వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు దూరం అయ్యే అవకాశం వుంది. అవన్నీ పెద్ద సమస్యలు కాదని పొత్తుతోనే ముందుకి వెళితే వచ్చే ఎన్నికల నాటికీ పొత్తు ధర్మం ప్రకారం బీజేపీకి దానితో ఉంటున్న జనసేనకు సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది. దీనితో పార్టీలో అసంతృప్తి పెరిగిపోయి, రెబల్స్ తయారైయే ఛాన్స్ వుంది. దానిని క్యాష్ చేసుకొని చంద్రబాబు వలసలను ప్రోత్సహిస్తాడు. దీనికి తోడు అప్పటికి NDA కూటమి అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతుంది, కాబట్టి వ్యతిరేకత అనేది సర్వసాధారణం. దాని ప్రభావం ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న వైస్సార్సీపీ పార్టీ మీద పడే అవకాశం లేకపోలేదు.

  ఒక పక్క సీట్లు త్యాగం చేసి, మరోపక్క వ్యతిరేకత మీదేసుకొని వైసీపీ సాధించేది ఏమి లేదు. వీటిని పక్కన పెడితే మరో ముఖ్యమైన అంశం ప్రత్యేక హోదా. బీజేపీతో కొట్లాడి ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా తీసుకోని వస్తే సీఎం జగన్ చరిత్రలో మిగిలిపోతాడు, కానీ ఇప్పటికే బీజేపీ హోదా ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. అలాంటి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అది పార్టీకి తీరని నష్టం కలిగించే అవకాశం లేకపోలేదు. వైసీపీ బీజేపీతో కలిస్తే లాభాలు విషయం ఏమో కానీ, నష్టాలు మాత్రం బాగానే ఉన్నాయి.. ఇవన్నీ బాగా ఆలోచించిన బాబు ఒక వైసీపీ అంత త్వరగా NDA లో కలిసిపోదులే అనే ధీమాలో వున్నాడు. బీజేపీ,వైసీపీ పార్టీ పొత్తు వ్యక్తిగతంగా చంద్రబాబుకి నష్టం కలిగించిన కానీ, పార్టీ పరంగా మాత్రం లాభం చేకూరే అవకాశం ఉంది..