ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన సహజ దోరణిలో నయా డ్రామాలకు తెరలేపుతున్నారు. ఈ 3 రాజధానుల బిల్లుల పై గవర్నర్ ఆమోదం తెల్పగానే, మరోసారి అమరావతి రైతుల్ని భ్రమింపజేయడానికి ముసలి కన్నీరు కార్చిన చంద్రబాబు, రాష్ట్ర ప్రజలంతా ఈ బిల్లులకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
అయితే శనివారం చంద్రబాబు అండ్ బ్రదర్స్ మరో కొత్త డ్రామాకి రంగం సిద్ధం చేశరని వార్తలు జోరుగా ప్రసారం అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. మూడు రాజధానుల బిల్లుల ఆమోదానికి వ్యతిరేకంగా చంద్రబాబుతో సహా 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామా చేయడానికి నిర్ణయించారని జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం చంద్రబాబు అండ్ టీడీపీ తమ్ముళ్ళు గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాలు అందిచనున్నట్లు సమచారం. అయితే మరోవైపు అధికార వైసీపీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందని సమాచారం. ఒకవేళ చంద్రబాబుతో సహా 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. వెంటనే స్పీకర్ ద్వారా టీడీపీ నేతల రాజీనామాను ఆమోదింప జేసి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవడానికి వైసీపీ సిద్ధమవుతోందని సమాచారం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఈ వ్యవహారం ఇంకెన్ని సంచలనాలకు తెరలేపుతుందో చూడాలి.