గాల్వాన లోయ ఘర్షణతో చైనా పై భారత్ దాడికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఢీ అంటే ఢీ అంటూనే కయ్యానికి ఏమాత్రం వెనకడుగు వేయలేదు భారత్. రణమే అంటూ భారత్ ముందుకెళ్తోంది. బ్యాన్ చైనా అంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమానికి తెర లేపారు. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులను, వస్తువులను బ్యాన్ చేయడం జరిగింది. భారతీయ రైల్వే చైనాతో కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ను వదులకుని చైనా చెంప మీద కొట్టింది. తాజాగా టిక్ టాక్ సహా 59 యాప్ లను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో చైనాకు పెద్ద ఎత్తున నష్టం తప్పలేదు. చైనా ఆబాధని పైకి కక్కలేక..లోపలికి మింగలేక మండిపోతుంది.
ఈ దెబ్బకు అక్కసంతో ఇండియా వెబ్ సైట్లపై చైనా బ్యాన్ చేసింది. ఇంకా చైనా ని ఎన్నిరకాలుగా తొక్కాలో అన్ని రకాలుగా ప్రపంచ స్థాయిలో అణగదొక్కాలని భారత్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఓ వైపు భారత్ నుంచి చైనా ఎదుర్కోంటున్న సమస్య. అటు అగ్రరాజ్యం అమెరికా చైనా పేరెత్తితోనే ఒంటికాలుపై లేచిపడుతుంది. అవకాశం ఉన్నప్పుడల్లా చైనాని ఎలా ఎండగట్టాలో! అలా ఎండగడతాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పనిలో పనిగా అమెరికా ఎన్నికల ప్రకోపాన్ని కూడా ట్రంప్ చైనా పై చూపిస్తున్నారు. ఇప్పటికే చైనా కరోనా వైరస్ కి పురుడు పోసి ప్రపంచం మీద పగతీర్చుకోమని పంపిచిందని ట్రప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.
ప్రపంచ వేదికలపై చైనా ని ఒంటరి దేశంగా చేయాలన్న కోపాన్ని ఎన్నోసార్లు వెళ్లగక్కారు. తాజాగా చైనా ఉత్పత్తులను బ్యాన్ చేస్తూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సాంకేతిక దిగ్గజాలు హువావే, జెడ్‌టీఈ నుంచి భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని ఈ సంస్థల నుంచి చేసే కొనుగోళ్లపై నిషేధం విధించారు. ఈ మేరకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్-ఎఫ్‌సీసీ ప్రకటన జారీ చేసింది. భారత్ చైనా యూప్ ల బ్యాన్ అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం తో చైనాకు గట్టి షాక్ తగిలినట్లైంది. ఇటు అమెరికా..అటు ఇండియా మధ్యలో చైనా ఫుట్ బాల్ లా మారిపోయింది. భారత్ తో చైనా యుద్ధానికి దిగితే అమెరికా దళాలు రంగంలోకి దిగుతాయని ఇప్పటికే చైనాకి హెచ్చరికలు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే భారత్ ఎవరి సహాయం తీసుకోకుండా డ్రాగన్ పై ఒంటరిగానే పోరాటం చేయాలని భావిస్తోంది.