దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహరాష్ర్టలో అత్యధికంగా కేసులు నమోదవ్వగా మిగతా రాష్ర్టాల్లోనూ భారీగానే నమోదవుతున్నాయి. అయితే కర్ణాటక తర్వాత ఐటీ సహా ఇతర రంగాల్లో దూసుకుపోతన్న తెలంగాణ లో(హైదరాబాద్) మాత్రం అంతగా కేసులు నమోదవ్వడంలో, ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అంటూ గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. బెంగుళూరు, ముంబై సిటీలకు ధీటుగా హైదరాబాద్ అభివృద్ది చెందింది. అలాంటి సిటీలో సైతం కేసులు లేవని ఇదంతా కేసీఆర్ గొప్పతనం అంటూ టీఆర్ ఎస్ పార్టీ చెప్పుకుంటోంది. దీనికి తోడు కరోనా టెస్టుల సంఖ్య కూడా తాజాగా అనుమానం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
తాజాగా కరోనా పరీక్షణ నిర్వహనఫై కేంద్రం ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. దేశంలో అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో మాత్రం కేవలం 21వేల టెస్టులు మాత్రమే జరిగాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాపై ఆ రాష్ర్టం నిర్లక్షంగా వ్యవహరిస్తుందని మొట్టికాయలు వేసింది. ఇదే కొనసాగితే తీవ్రం నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాసారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని కేంద్రం సూచించింది. దేశ సగటుతో పొలిస్తే రాష్ర్టంలో చాలా తక్కువ పరీక్షలు జరిగాయని ప్రభుత్వం నిద్ర పోతుందా? అని ప్రశ్నించారు.
దీంతో తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ లైన్ లోకి వచ్చి కేంద్రానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే ఇటీవలే కేంద్ర ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఆ వ్యాఖ్యలు సంచలనమ య్యాయి. కేంద్రంలోనూ దీనిపై డిస్కషన్ జరిగింది. తాజాగా కేంద్రం కరోనా పరీక్షలు అడ్డం పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అవ్వడం కౌంటర్ గా భావించాలా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. లేదంటే ఇప్పటివరకూ గుర్తుకురానీ పరీక్షల సంగతి కేంద్రానికి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చినట్లు.