చంద్రబాబు నోట జగన్ మాట

jagan cbn telugu rajyam

రాజకీయాల్లో ఒక మాట మీద నిలబడటం, ఇచ్చిన మాట కోసం పాటుపడటం అనేది జరగని పని. అలాగే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మాటలు మారుస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాటలను మంత్రాల్లా వల్లిస్తున్నాడు. కరోనా వచ్చిన కొత్తలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు, చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కాదు. ప్రభుత్వం కరోనాను కట్టడి చెయ్యడంలో విఫలమైందని, జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నానరని అవహేళన చేశారు. అయితే ఇప్పుడు కారణం విషయంలో జగన్ చెప్పిన మాటను ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు.

బాబు నోట జగన్ మాట

కరోనా వచ్చిన కొత్తలో ఏపీ ముఖ్యమంత్రి ఓపెన్ గా క‌రోనాతో స‌హ‌జీవ‌నం చేయాల్సి ఉంటుంద‌ని, ఈ పంచాయితీ ఇప్పట్లో పోదని సహజీవనం తప్పదని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అప్పుడు టీడీపీ నేతలు – చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు! ఏపీ ముఖ్యమంత్రి అవగాహనలేకుండా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు క‌రోనా మీద‌ వెబినార్ నిర్వ‌హిస్తున్న చంద్ర‌బాబు క‌రోనా నుంచి ఇప్పుడ‌ప్పుడే బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేదని చెప్పుకొచ్చారు. మరి జగన్ కరోనా వచ్చిన కొత్తలోనే చెప్పింది ఇదే కదా. ఇక.. క‌రోనా నుంచి ఇప్పుడ‌ప్పుడే విముక్తి ఉండ‌ద‌ని బాబు చెప్పడం ఒకెత్తు అయితే… కరోనా తగ్గినవెంటనే కార్యకర్తల దగ్గరకు వస్తానని చెప్పిన మాటలు ఈ సందర్భంగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కరోనా విషయంలో జగన్ విఫలమయ్యారా!

కరోనాను కట్టడి చెయ్యడంలో దాదాపు అన్ని దేశాలు విఫలమయ్యాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కరోనాను కట్టడి చేయడంలో విఫమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కరోనా టెస్టులు నిర్వహించిన విధానంపై ఇతర దేశాల నాయకుల నుండి కూడా ప్రశంసలు దక్కాయి. అలాగే పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కరోనా విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని అక్కడి హై కోర్ట్ ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసింది కానీ ఏపీ ప్రభుత్వానికి అలాంటి హెచ్చరికలు ఏవి అందలేదు.