బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి ఆత్మహత్యే కారణమని ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీబీఐకి ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ నివేదికను సమర్పించింది. అందరూ అనుమాబాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి ఆత్మహత్యే కారణమని ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందేనిస్తున్నట్టుగా విష ప్రయోగం జరగలేదని.. గొంతు నులిమి చంపినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని ఏడుగురు వైద్యులతో కూడిన ఎయిమ్స్ బృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ సుధీర్ గుప్తా మాట్లాడుతూ.. ఉరి వేసుకున్నట్టు తప్ప సుశాంత్ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. హత్య అనే కోణంతో సహా దర్యాప్తులోని అన్ని అంశాలను సూక్ష్మంగా పరిశీలిస్తున్నామని ధృవీకరిస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది.
కాగా సుశాంత్ కేసుని మొదటి నుంచి ఫాలో అవుతున్న నేషనల్ ఛానల్ రిపబ్లిక్ టీవీ.. అతనిది ఆత్మహత్య కాదు హత్యే అంటూ చెప్పే ప్రయత్నంలో భాగంగా అనేక కథనాలు వెలువరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సుశాంత్ కేసులో ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా వ్యవహరించిన తీరు అనేక అనుమానాలు కలిగిస్తోందని చెప్పే ప్రయత్నం చేసింది. ఆగష్టు 22న సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టులో కొన్ని లోపాలున్నాయన్న సుధీర్ గుప్తా ఇప్పుడు యూ టర్న్ తీసుకొని అతనిది సూసైడ్ అని పేర్కొనడంపై డౌట్ వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సుశాంత్ ది హత్య అనే కోణాన్ని కూడా తోసిపుచ్చలేదని సీబీఐ తాజా ప్రకటన సూచిస్తుంది. జూన్ 14న ముంబైలోని బాంద్రాలో ఉన్న ఫ్లాట్ లో సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై దాదాపు 45 రోజులుగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సుశాంత్ అభిమానులు అతని కుటుంబానికి న్యాయం జరగాలని సోషల్ మీడియా వేదికగా గత మూడున్నర నెలలుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు.