జగన్ కేసులు.. ఏవి ముందు.. ఏవి వెనుక ?

Another break in YS Jagan's cases
ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మీద గతంలో అవినీతి, అక్రమాస్తుల అభియోగాలతో పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.  ఆ అభియోగాల మూలంగానే ఆయన ఏడాదికి పైగా జైల్లోనే ఉన్నారు.  విజయసాయిరెడ్డి మీద కూడ కేసులు ఫైల్ అయ్యాయి.  ఆ కేసుల్లో కొన్ని సీబీఐ కేసులు కాగా ఇంకొన్ని ఈడీ పెట్టిన కేసులు.  సీబీఐ నమోదుచేసిన కేసులు ఆధారంగా పెట్టినవి ఈడీ కేసులు.  అంటే ఈడీ కేసులకు మూలం సీబీఐ కేసులు.  ఇదే కేసులు స్వతంత్య్ర కేసులు.  ఈ కేసుల్లో విచారణ వేగవంతం అవుతుందని ఎన్నో నెలలుగా అంటున్నారు కానీ ఇప్పటికీ వేగవంతం కాలేదు.  ప్రతిపక్షాలు అయితే కేసులు విచారణకు వస్తాయి, రుజువవుతాయి, జగన్ మధ్యలోనే జైలుకు వెళతారు అంటూ ఎద్దేవా చేశాయి.  కానీ వాస్తవానికి పరిస్థితి అలా లేదు.  
 
Another break in YS Jagan's cases
Another break in YS Jagan’s cases
 
ఇంతవరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో అభియోగాల నమోదే ఇంకా మొదలుకాలేదు.  సీబీఐ పెట్టిన కేసుల్లో  అభియోగాలు నిజమైతేనే ఈడీ కేసులు కూడ రుజువయ్యే అవకాశం ఉంది.  ఒకవేళ సీబీఐ అభియోగాలు రుజువుకాని పక్షంలో ఈడీ కేసులు తేలిపోయినట్టే.  అలాంటప్పుడు ముందు సీబీఐ కేసులను విచారించాలి.  అవి నిజమైతే ఈడీ కేసులు విచారణకు వెళ్లాలి.  అంతేకానీ ముందుగా ఈడీ కేసులు విచారణకు వెళుతుండటం మీద జగతి ప్రబ్లికేషన్స్, విజయసాయిరెడ్డిల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ మీమాంస కాస్త హైకోర్టు వరకు వెళ్ళింది.  గతంలో కూడ ఇలాంటి సందిగ్దతే ఎదురుకాగా మొదట సీబీఐ కేసులను విచారించండి లేదా రెండింటినీ ఒకేసారి సమాంతరంగా అయినా విచారించండి అని తీర్పు వచ్చింది.  
 
అయితే ఇప్పుడు మాత్రం సీబీఐ కేసులు విచారణకు రావట్లేదు ఈడీ కేసులు ముందు విచారణ జరుగుతాయని అంటున్నారు.  దీంతో మళ్ళీ రగడ మొదలైంది.  రెండు కేసులను సమాంతరంగా అయినా విచారణ లేకుండా ముందు ఈడీ కేసులు నిర్వహించడం ఏమిటని, ఒకవేళ సీబీఐ అభియోగాలు రుజువు కాకపోతే ఈడీ కేసుల విచారణ వృధాయే కదా, దీని మీద హైకోర్టుకు వెళతాం అంటున్నారు.  మరి హైకోర్టు ఈ కేసును ఎప్పుడు తీసుకుంటుంది, తీసుకుని ముందుగా ఈడీ కేసులను విచారించవచ్చని చెబుతుందా లేకపోతె మొదట సీబీఐ ఆతర్వాతే ఈడీ కేసులని అంటుందా అనేది ఇరుకునపడిపోయింది.